NDA and NA Notification : ఈ అర్హతతోనే త్రివిధ దళాల్లో పర్మనెంట్ కమిషన్‌తో కొలువు అవకాశం.. ఈ పరీక్షతోనే..
➔ ఎన్‌డీఏ, ఎన్‌ఏ(1)–2025 నోటిఫికేషన్: 2024, డిసెంబర్ 11 .
➔ దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 31; పరీక్ష తేదీ: 2025, ఏప్రిల్ 13.
➔ ఎన్‌డీఏ, ఎన్‌ఏ(2)–2025 నోటిఫికేషన్: మే 28, 2025.
➔ దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్ 17.
➔ పరీక్ష తేదీ: 2025 సెప్టెంబర్ 14
ఇంటర్మీడియెట్ అర్హతతోనే.. త్రివిధ దళాల్లో పర్మనెంట్ కమిషన్‌తో కొలువు అందించే పరీక్ష.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ/నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్. ఈ పరీక్షను యూపీఎస్‌సీ ఏటా రెండుసార్లు ఎన్‌డీఏ/ఎన్‌ఏ–1,ఎన్‌డీఏ/ఎన్‌ఏ–2 పేరుతో నిర్వహిస్తుంది. దీనిద్వారా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఫ్లయింగ్ విభాగం, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ విభాగం)లో లెఫ్ట్‌నెంట్, సబ్ లెఫ్ట్‌నెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ చేపడతారు. అదే విధంగా.. నేవల్ అకాడమీ (10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్)కి కూడా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Combined Geo Scientist 2025 : కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2025.. పరీక్ష తేదీ!
అర్హతలు
➔ ఆర్మీ వింగ్: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. ఎయిర్‌ఫోర్స్, నేవీ, నేవల్ అకాడమీకి దరఖాస్తు చేసుకునేందుకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లుగా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులవ్వాలి.
రెండు దశల ఎంపిక ప్రక్రియ
➔ ఎన్‌డీఏ, ఎన్‌ఏకు రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ. తొలిదశ రాత పరీక్షలో.. రెండు పేపర్లు ఉంటాయి. అవి.. పేపర్–1(మ్యాథమెటిక్స్–300 మార్కులు), పేపర్–2(జనరల్ ఎబిలిటీ టెస్ట్–600 మార్కులు). తొలిదశ రాత పరీక్షలో విజయం సాధించి.. మెరిట్ జాబితాలో నిలిచిన వారికి మలిదశలో 900 మార్కులకు ఎస్‌ఎస్‌బీ టెస్ట్/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
➔ ఎయిర్‌ఫోర్స్ విభాగాన్ని ప్రాథమ్యంగా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు ఎస్‌ఎస్‌బీ ప్రక్రియ అనంతరం కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ నిర్వహిస్తారు.
శిక్షణ, డిగ్రీ సర్టిఫికెట్
➔ రెండు దశల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి..తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీల్లో శిక్షణనిస్తారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ విభాగలకు సంబంధించి నేషనల్ డిఫెన్స్ అకాడమీ పుణెలో, నేవల్ అకాడమీ అభ్యర్థులకు ఎజిమలలోని నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. ఇది కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. బీఏ,బీఎస్సీ,బీటెక్ పట్టాలు అందజేస్తారు.
➔ నేవల్ అకామీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన వారికి నేవల్ అకాడమీ (ఎజిమల)లో నాలుగేళ్లపాటు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. ఆ తర్వాత వీరికి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్‌లలో ఏదో ఒక బ్రాంచ్‌తో
బీటెక్ సర్టిఫికెట్ కూడా అందజేస్తారు.
Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎప్పటినుంచంటే..?