AIIMS Contract Jobs : ఎయిమ్స్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు..

ఝజ్జర్‌(హర్యానా)లోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో.. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో ఒప్పంద ప్రాతిపదికన  వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 34.
»    పోస్టుల వివరాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్‌–07, ల్యాబ్‌ టెక్నీషియన్‌–07, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌–06, టెక్నాలజిస్ట్‌(ఓటీ)–05, పేషెంట్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌–02, రేడియోగ్రాఫర్‌–07.
»    అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. పో­స్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ(మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ/మెడికల్‌ ల్యాబొరేటరీ సైన్స్‌/అనెస్తీషియా/ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజిస్ట్‌/రేడియోగ్రఫీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 18 నుంచి 40 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రాజెక్ట్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌), బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌),బీఈసీఐఎల్‌ భవన్,సీ–56/ఏ–17, సెక్టార్‌–62, నోయిడా చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 27.08.2024.
»    వెబ్‌సైట్‌: https://www.becil.com

Schools And Colleges Reopen In Bangladesh: నెల రోజుల తర్వాత తెరుచుకున్న విద్యసంస్థలు.. ఎందుకంటే!

#Tags