NMAT Notification 2024 : మేనేజ్‌మెంట్ విద్య కోర్సుల్లో ప్ర‌వేశానికి ఎన్‌మ్యాట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. విద్యార్హ‌త‌లు ఇలా..!

మేనేజ్‌మెంట్‌ విద్య కోర్సుల్లో చేరాలనుకునే వారి కోసం ఎన్‌మ్యాట్‌ పరీక్ష ప్రకటన విడుదలైంది.

»    డిగ్రీ విదార్హతతో దరఖాస్తుకు అవకాశం
దేశంలోని పేరొందిన బిజినెస్‌ సూళ్లల్లో మేనేజ్‌మెంట్‌ విద్య కోర్సుల్లో చేరాలనుకునే వారి కోసం ఎన్‌మ్యాట్‌ పరీక్ష ప్రకటన విడుదలైంది. మేనేజ్‌మెంట్‌ రంగంలో కెరీర్‌ కోరుకునే అభ్యర్థులకు ఎన్‌మ్యాట్‌ చక్కటి మార్గం. ఈ పరీక్షలో సాధించిన స్కోర్‌ ద్వారా దేశంలోని 68పైగా విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందవచ్చు. పలు విదేశీ యూనివర్సిటీలు సైతం ఈ స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. తాజాగా ఎన్‌మ్యాట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది ఈ నేపథ్యంలో.. ఎన్‌మ్యాట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, ప్రిపరేషన్‌ తదితర వివరాలు...
అందించే కోర్సులు

»    పీజీడీఎం: బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌(బీఎం), హ్యూ మన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌(హెచ్‌ఆర్‌ఎం), జనరల్‌ మేనేజ్‌మెంట్‌(జీఎం), ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, వెంచర్‌ క్రియేషన్‌(ఐఈవీ) తది తర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రొఫెషనల్‌ కోర్సులు చదివిన వాళ్లు, పని అనుభవం ఉన్నవారి కోసం నాలుగేళ్ల ఫెలో ప్రోగ్రాం ఇన్‌మేనేజ్‌మెంట్‌(ఎఫ్‌పీఎం)కోర్సు అందుబాటులో ఉంది.
»    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు ఎన్‌మ్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

UPSC New Chairperson : యూపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్‌గా ప్రీతిసుదాన్‌.. ఈమె గ‌తంలో..

పరీక్ష విధానం
»    ఎన్‌మ్యాట్‌ పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంతోపాటు కంప్యూటర్‌ అడాప్టివ్‌ టెస్ట్‌ పద్ధతిలోనూ నిర్వహిస్తారు. కాబట్టి విద్యార్థులు రెండింటికి మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని గ్రహించాలి. ఈ పరీక్ష మొత్తం 108 ప్రశ్నలకు ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు.. లాంగ్వేజ్‌ స్కి­ల్స్, లాజికల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఇలా ప్రతి విభాగం నుంచి 36 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. 
»    ప్రతి సెక్షన్‌కు కేటాయించిన సమయం ముందుగానే నిర్ణయించి ఉంటుంది.
    ప్రతి విభాగానికి నిర్ధిష్ట వ్యవధితో మొత్తం 120 నిమిషాలు సమయం ఉంటుంది. అలాగే ఒకసారి ఒక ప్రశ్న మాత్రమే కనిపిస్తుంది. దానికి సమాధానం గుర్తించిన తర్వాతనే వేరే ప్రశ్నకు వెళ్లే అవకాశం ఉండదు. అభ్యర్థులు ప్రశ్నలను స్కిప్‌ చేయడానికి అవకాశం ఉండదు. పరీక్ష రాసేక్రమంలో ఈ సెక్షన్లు ఏ క్రమంలో  రావాలో విద్యార్థి ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పు జవాబులకు నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు.

DEO Praneetha: విద్యార్థులకు మరింత పోషకాహారం

పరీక్షలో రాణించేలా
»    లాంగ్వేజ్‌ స్కిల్స్‌: ఈ విభాగంలో రీడింగ్‌ కాంప్రహెన్షన్, పేరా ఫార్మింగ్, ఎర్రర్‌ ఐడెంటిఫికేషన్, ప్రిపొజిషన్స్, సెంటన్స్‌ కంప్లీషన్, అనాలజీ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. విద్యార్థులు ఈ విభాగం బాగా రాయాలనుకుంటే..ముందు ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలి. విభిన్న పదాలు, వాక్యనిర్మాణం, గ్రామర్‌ నేర్చుకోవడంతో పాటు సాధన చేయాలి. 
»    లాజికల్‌ రీజనింగ్‌: క్రిటికల్‌ రీజనింగ్, అనలిటికల్‌ పజిల్స్, డిడక్షన్స్, ఇతర రీజనింగ్‌ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. క్రిటికల్‌ రీజనింగ్‌ విద్యార్థుల పఠన సామర్థ్యాలను పరీక్షించేదిగా ఉంటుంది. బాగా సాధన చేసినవారు ఎక్కువగా స్కోరు చేయగలిగే విభాగం. అందువల్ల విద్యార్థులు ఈ అంశంపై దృష్టిపెట్టి చదవాలి.
»    క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌: నంబర్‌ ప్రాపర్టీస్, అర్థమెటిక్, ఆల్జీబ్రా, ప్రొబబిలిటీ, డీఐ గ్రాఫ్స్‌–ఛార్ట్స్, డేటా సఫిషియన్సీ వంటి అంశాలు చదవుకోవాలి. చాలావరకు ప్రశ్నలు ప్రాబ్లమ్స్‌ సాల్వింగ్‌పై అడిగే అవకాశం ఉంటుంది. నంబర్స్, జామెట్రీ, లాగరిథమ్స్, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ వంటి అంశాలపై దృష్టిపెట్టాలి. వీటి గురించి ప్రాథమిక అంశాల నుంచి నేర్చుకోవాలి. తర్వా­త మాదిరి ప్రశ్నలు చూసి అవగాహన పెంచుకోవాలి. అతి సులభమైన ప్రశ్నలు నుంచి అత్యంత క్లిష్టమైనవి వరకు అన్నింటినీ సాధన చేయాలి.

Ex-Servicemen: పదవీ విరమణ చేసిన‌ సైనికులకు కార్పొరేట్‌ ‘సెల్యూట్’!

ప్రవేశం కల్పించే ఇన్‌స్టిట్యూట్స్‌
నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్, కేజే సోమయ్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ముంబై); టి.ఏ.పాయ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (టీఏపీఎంఐ)–మణిపాల్, యూనివర్సిటీ ఆఫ్‌ పెంట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ (యూపీఈఎస్‌) తదితర ఇన్‌స్టిట్యూట్స్‌ ఎన్‌మాట్‌ స్కోర్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
ముఖ్యసమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 10.10.2024
»    పరీక్ష తేదీలు: 2024,అక్టోబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 19వ తేదీల వరకు..
»    తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
»    వెబ్‌సైట్‌: www.mba.com/exams/nmat

Scholarship Program : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2024–25..

#Tags