సివిల్స్ మెయిన్స్ మార్పులు.. ప్రిపరేషన్ వ్యూహం
- ఆప్షనల్స్‌కు వెయిటేజీ తగ్గింపు
- జనరల్ స్టడీస్‌కు అధిక ప్రాధాన్యం
- జీఎస్‌లో నైతిక విలువలపై ప్రత్యేక పేపర్
సివిల్స్ మెయిన్స్‌లో అనూహ్య మార్పులపై.. ముఖ్యంగా మాధ్యమం నిబంధనపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రాంతీయ భాషలో సివిల్స్ పరీక్షలు రాసి.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి ప్రతిష్టాత్మక సర్వీసుల్లో చేరాలని కలలుగన్న వేల మంది అభ్యర్థుల ఆశలపై యూపీఎస్సీ నీళ్లు గుమ్మరించింది. దీనిపై పలు రాష్ట్రాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. మాధ్యమం, లాంగ్వేజ్ ఆప్షనల్ ఎంపిక విషయంలో వెసులుబాటు ఇచ్చినా, ఇవ్వకపోయినా.. ఎస్సే, ఇంగ్లిష్ పేపర్, జనరల్ స్టడీస్ నాలుగు పేపర్ల్లపై అభ్యర్థులు తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. మారిన పరీక్షా విధానం, సిలబస్ సంకేతాలను అందిపుచ్చుకొని కార్యోన్ముఖులు కావాలి. సివిల్స్ ఆశావహులను విజయం దిశగా నడిపించే క్రమంలో మెయిన్స్ మార్పులపై సాక్షి నిపుణుల సమగ్ర విశ్లేషణ...
- ‘భవిష్యత్తులో సివిల్ సర్వీసులో అడుగుపెట్టి.. ప్రభుత్వ పాలసీల రూపకల్పన, ఆచరణాత్మకతకు అవసరమైన విధంగా మార్పులు ఉన్నాయి. ఇది సమంజసమే’
- ‘గతంలో ఉన్న ఆప్షనల్ వెయిటేజీని జనరల్ స్టడీస్‌కు బదిలీ చేశారు. దాంతో అభ్యర్థులు ఆమూలాగ్రం అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది’
- ‘ప్రస్తుత జనరల్ స్టడీస్‌లో పేర్కొన్న సిలబస్‌లో ప్రతి సబ్జెక్ట్‌కు సమ ప్రాధాన్యం కల్పించడం ఆహ్వానించదగిన పరిణామం’
సివిల్స్ మెయిన్స్‌లో మార్పులపై ఆయా సబ్జెక్ట్ నిపుణులు, అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలివి.
జనరల్ స్టడీస్‌కు పెరిగిన ప్రాధాన్యం
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ తాజా మార్పుల్లో ప్రధానమైన అంశం జనరల్ స్టడీస్‌కు ప్రాధాన్యం పెంచి.. ఆప్షనల్ వెయిటేజీ తగ్గించడమే. గతేడాది వరకు రెండు ఆప్షనల్స్‌లో నాలుగు పేపర్లతో పరీక్ష నిర్వహించిన యూపీఎస్సీ.. తాజా మార్పుల్లో ఒకే ఆప్షనల్‌లో రెండు పేపర్లకు పరిమితం చేసింది. ఆ స్థానంలో జనరల్ స్టడీస్‌లో రెండు పేపర్లను అదనంగా చేర్చింది. ప్రస్తుతం మొత్తం నాలుగు పేపర్లలో జనరల్ స్టడీస్ పరీక్షను నిర్వహించనుంది. గతంలో పేపర్-4, పేపర్-5లుగా ఒక్కో పేపర్‌కు 300 మార్కులకు నిర్వహించిన జనరల్ స్టడీస్ పేపర్లను.. ప్రస్తుతం పేపర్-2, పేపర్-3, పేపర్-4, పేపర్-5గా పేర్కొంటూ.. ఒక్కో పేపర్‌కు 250 మార్కులు కేటాయించింది.
అంతేకాకుండా ప్రతి పేపర్‌లోనూ ఆయా అంశాలకు సంబంధించి సిలబస్‌ను నిర్దిష్టంగా పేర్కొనడం అభ్యర్థులకు అనుకూలంగా భావించొచ్చు. గతంలో ఏ అంశాలకు ఎంత వెయిటేజీ ఇవ్వాలి? ఏది ప్రాధాన్యం అనే విషయంలో కొంత సందిగ్ధత ఉండేది. కానీ ఇప్పుడు సిలబస్‌ను, సబ్జెక్టులను వాటిలోని అంశాలను నిర్దిష్టంగా పేర్కొనడంతో అభ్యర్థులకు కొంత స్పష్టత వచ్చిందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే ఆప్షనల్ విధానం.. కొన్ని సబ్జెక్ట్‌లకే అనుకూలంగా ఉంటోందని, అందరికీ సమాన అవకాశాలు లభించట్లేదనే అభిప్రాయాలు, నిరసనల నడుమ యూపీఎస్సీ కామన్ లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌కు ఆస్కారం ఇచ్చేలా కొత్త సిలబస్ రూపకల్పన చేసిందనేది నిపుణుల అభిప్రాయం.
అన్ని పేపర్లు.. మెరిట్ ర్యాంకింగ్‌లో
తాజా ప్రధాన మార్పు.. ఆప్షనల్ సబ్జెక్ట్‌లోని రెండు పేపర్లు సహా ఏడు పేపర్లుగా పేర్కొన్న పరీక్షలో అన్ని పేపర్లలో పొందిన మార్కులను ఫైనల్ మెరిట్ ర్యాంకింగ్‌లో పరిగణనిస్తామని పేర్కొనడం. అంతేకాకుండా సబ్జెక్టుల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించే విచక్షణ కూడా తమకుందని యూపీఎస్సీ ప్రకటించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థులు తమ సామర్థ్యం, విద్యా నేపథ్యం ఆధారంగా ఒక పేపర్‌లో తక్కువ మార్కులు పొందినా.. మరో పేపర్‌లో అత్యధిక మార్కులు పొందినా.. సబ్జెక్ట్ వారీ కటాఫ్ కూడా ఉండొచ్చు అనే ప్రకటన శరాఘాతంగా మారింది. అయితే పాలనా పరంగా పలు నివేదికలు, విధి విధానాలను ఇంగ్లిష్‌లోనే రూపొందించడం ఆవశ్యకంగా మారిన తరుణంలో అభ్యర్థులకు ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉందో? లేదో? తెలుసుకునేందుకు యూపీఎస్సీ విధించిన నిబంధన సమంజసమేనని మరికొందరి వాదన.
కొత్తగా పేపర్-5 (జీఎస్-4)
యూపీఎస్సీ తాజా మార్పుల్లో తప్పనిసరిగా ప్రస్తావించదగిన మరో మార్పు ‘ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్’ అంశాలతో ఒక కొత్త పేపర్ (పేపర్-5, జీఎస్ పరంగా పేపర్-4) ను ప్రవేశపెట్టడమే. భవిష్యత్తులో సివిల్ సర్వీసు అధికారులుగా విధులు నిర్వర్తించేవారికి ఉండాల్సిన నైతిక విలువలు, అన్నివర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా వ్యవహరించే దృక్పథం, చిత్తశుద్ధి వంటి అంశాలతో ఉన్న ఈ పేపర్‌ను ప్రవేశపెట్టడం ఆహ్వానించదగిన పరిణామమని నిపుణుల అభిప్రాయం. కేవలం క్రేజీ కెరీర్ అనే కోణంలో ఆలోచించి.. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో విజయం సాధించి.. కెరీర్‌లో ప్రజలతో మమేకం కాలేని వారు విధులు సరిగా నిర్వర్తించలేరు. ఈ క్రమంలో ఔత్సాహిక అభ్యర్థుల్లో ఆ లక్షణాలు ఉన్నాయో? లేదో? ముందుగానే పరీక్షించడం మంచి పరిణామమే అంటున్నారు. అయితే ఈ పేపర్‌కు సంబంధించి సిలబస్‌పరంగా అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. మొత్తం ఎనిమిది భాగాలుగా పేర్కొన్న సిలబస్‌లో కొన్ని సైకాలజీ, మరికొన్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధితంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా సిలబస్‌లో చివరి అంశంగా చేర్చిన Case Studies on above issues మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
తగ్గిన ఇంటర్వ్యూ మార్కులు
తాజా నోటిఫికేషన్‌ను పరిశీలిస్తే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో తుదిదశ పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) మార్కులను సైతం తగ్గించింది. గతేడాది వరకు 300 మార్కులకు నిర్వహించిన పర్సనాలిటీ టెస్ట్‌ను.. ఇకపై 275 మార్కులకే పరిమితం చేశారు. పరీక్ష రాసే మాధ్యమం విషయంలో కొన్ని నిబంధనలు స్పష్టంగా పేర్కొన్న యూపీఎస్సీ.. ఇంటర్వ్యూను అభ్యర్థులు తమ మాతృభాష లేదా రాజ్యాంగం గుర్తించిన ఇతర ప్రాంతీయ భాషల్లో చేసుకోవచ్చా? అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు.
‘కోర్’కు తగ్గింది.. కాంటెంపరరీకి పెరిగింది
మార్పులతో వెలువడిన నోటిఫికేషన్ అందులో పేర్కొన్న పేపర్లు, సిలబస్‌ను పరిశీలిస్తే.. ఆయా సబ్జెక్టుల ‘కోర్’ అంశాల ప్రాధాన్యం గణనీయంగా తగ్గింది. అదే సమయంలో వాటికి సంబంధించి సమకాలీన అంశాల ప్రాధాన్యం ఎంతో పెరిగింది. అంటే.. అభ్యర్థుల్లో సామాజిక అంశాల పట్ల అవగాహనను పరీక్షించే విధంగా సిలబస్ రూపకల్పన జరిగింది. కేవలం పుస్తక నాలెడ్జ్‌తో విజయం సాధించి.. సామాజిక అంశాలపై అవగాహన లేని అభ్యర్థులు భవిష్యత్తులో విధులు సరిగా నిర్వర్తించలేరు. ఈ నేపథ్యంలో.. తాజాగా సమకాలీన అంశాలకు ప్రాధాన్యం పెంచడం సబబే అంటున్నారు. అంతేకాకుండా సివిల్స్ ప్రిపరేషన్ అంటే ‘పుస్తకాల పురుగులు కావాలి’.. ‘నిద్ర లేని రాత్రులు గడపాలి’ అని ఇప్పటివరకు ఉన్న అభిప్రాయాలకు స్వస్తి పలకొచ్చు. నిజమైన ఔత్సాహికులకు ఇది ఎంతో సానుకూల అంశం.
గ్రామీణం.. టు గ్లోబలైజేషన్
కోర్‌కు ప్రాధాన్యం తగ్గించి.. కాంటెంపరరీకి పెద్దపీట వేసిన యూపీఎస్సీ ఆయా అంశాల విషయంలోనూ అభ్యర్థుల్లో విస్తృత అవగాహన అవసరమయ్యేలా సిలబస్‌ను రూపొందించింది. ఈ క్రమంలో ప్రతి సబ్జెక్ట్‌లోనూ గ్రామీణ ప్రాంతం మొదలు.. గ్లోబలైజేషన్ వరకు అన్ని అంశాల్లోనూ సమకాలీన పరిజ్ఞానం తప్పనిసరిగా మార్చింది. చివరకు ప్యూర్ కోర్ సబ్జెక్ట్‌గా పేర్కొనే హిస్టరీలోనూ కాంటెంపరరీకి ప్రాధాన్యమివ్వడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. పేపర్-2 (జీఎస్-1)గా నిర్దేశించిన హిస్టరీ సిలబస్‌లో పేర్కొన్న అంశం Modern Indian history from about the middle of the eighteenth century until present (ఆధునిక భారత దేశ చరిత్ర- 18వ శతాబ్దం నుంచి ప్రస్తుతం వరకు) చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
పేపర్లు.. సబ్జెక్టుల మధ్య అంతర్గత సంబంధం
తాజా సిలబస్‌లో జనరల్ స్టడీస్‌లో సబ్జెక్టుల వారీగా విభజించిన మూడు పేపర్లు.. వాటిలో సిలబస్‌ను పరిశీలిస్తే.. అన్ని పేపర్లు, సబ్జెక్టుల మధ్య అంతర్గత సంబంధం కనిపిస్తుంది. ఉదాహరణకు.. ప్రస్తుతం అందరూ పాలిటీగా భావిస్తున్న పేపర్-3 (జనరల్ స్టడీస్-2)లోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రక్రియలు, స్వయం సహాయక బృందాలు, పేదరికం, ఆకలి వంటి అంశాల విషయంలో అటు పాలిటీ.. ఇటు ఎకానమీ(పేపర్-4; జనరల్ స్టడీస్-3)కి అంతర్గత సంబంధం ఉన్నట్లే. వీటికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన, అమలు పరిపాలనపరంగా పాలిటీ పరిధిలోకి వస్తే.. వాటి ద్వారా కలిగిన వృద్ధి, విజయాలు, ఆచరణాత్మకత వంటివి ఎకానమీ పరిధిలో పరిశీలించాల్సి ఉంటుంది. అదేవిధంగా పేపర్-5, జనరల్ స్టడీస్-3లోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అనే అంశం అటు పాలిటీ.. ఇటు జాగ్రఫీ సమ్మిళితం. ఇలా.. దాదాపు ప్రతి పేపర్‌లోని అంశాలు మిగతా పేపర్లలోని అంశాలతో అంతర్గత సంబంధం కలిగున్నాయి. సిలబస్ తీరు ఇలా ఉండటం.. ఒక విధంగా అభ్యర్థులకు కలిసొచ్చే అంశమే. ఒక పేపర్‌లోని నిర్దిష్ట అంశాన్ని చదివేటప్పుడు.. దానికి సంబంధించి మరో పేపర్‌లో ఉన్న అంశాలను బేరీజు వేసుకుని ఒకే సమయంలో తులనాత్మక అధ్యయనం చేస్తే సమయం ఆదా అవుతుంది.
ఎస్సేకు కలిసొచ్చే జీఎస్ ప్రిపరేషన్
తాజా మార్పుల్లో.. అభ్యర్థులకు సానుకూలంగా భావించాల్సిన మరో పరిణామం.. మూడు పేపర్లలో విస్తృత సిలబస్‌తో ఉన్న జనరల్ స్టడీస్ ప్రిపరేషన్.. పేపర్-1లో పేర్కొన్న జనరల్ ఎస్సేకు కలిసొస్తుంది. ‘జీఎస్ మూడు పేపర్ల సిలబస్‌ను పరిశీలిస్తే.. జనరల్ ఎస్సేలో అడిగే అంశాల పరిధి జీఎస్ అంశాల పరిధిని దాటే అవకాశం లేదు. కాబట్టి అభ్యర్థులు జీఎస్ పేపర్లు, అందులో సమకాలీన పరిణామాలు ఇమిడి ఉన్న అంశాలను చదివేటప్పుడే ఎస్సే కోణంలోనూ ప్రిపరేషన్ సాగించడం ఆశావహంగా ఉంటుంది’ అనేది సబ్జెక్ట్ నిపుణుల అభిప్రాయం. ఇందుకోసం ఆయా అంశాలను చదివేటప్పుడు జనరల్ ఎస్సేకు అవసరమైన రీతిలో ముఖ్యాంశాలను నోట్స్ రూపంలో రాసుకోవడం, సారాంశాన్ని సినాప్సిస్‌గా రూపొందించుకోవడం వంటి వ్యూహాలు అనుసరించాలని సూచిస్తున్నారు.
అనుకూలించే ఆప్షనల్స్
ఆప్షనల్‌ను ఒకే సబ్జెక్ట్‌కు పరిమితం చేసిన తాజా మార్పుల్లో.. కొన్ని ఆప్షనల్స్ జనరల్ స్టడీస్‌కు ఎంతగానో ఉపకరించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ అంశాలన్నీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నాయనేది ఆ సబ్జెక్ట్ నిపుణుల అభిప్రాయం. దీంతోపాటు పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, ఆంత్రోపాలజీ తదితర ఆప్షనల్స్ కూడా జనరల్ స్టడీస్‌కు కలిసొచ్చే విధంగా ఉన్నాయంటున్నారు సంబంధిత సబ్జెక్ట్ నిపుణులు. కాబట్టి ఈ ఆప్షనల్స్‌తో ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులు ఆ సబ్జెక్ట్‌లోని అంశాలు.. జనరల్ స్టడీస్‌లో ఎక్కడ సరితూగుతున్నాయో బేరీజు వేసుకుంటూ.. తులనాత్మక అధ్యయనం సాగించాలి. ఇదే క్రమంలో జీఎస్ ప్రిపరేషన్ సమయంలో ఆప్షనల్స్‌లో సరితూగే అంశాలకు ద్వితీయ ప్రాధాన్యమిచ్చి, కొత్త అంశాలపై దృష్టి సారించాలి.
లాస్ట్ అటెంప్ట్ వారికి ఆశనిపాతం
ఇప్పటికే ఏళ్ల తరబడి సివిల్స్‌కు ప్రిపరేషన్ సాగిస్తూ.. పరీక్షలకు కూడా హాజరై అటెంప్ట్‌ల కోణంలో చివరి అవకాశం ఉన్న వారికి తాజా మార్పులు ఆశనిపాతంగా మారాయని చెప్పొచ్చు. అకస్మాత్తుగా అమల్లోకి తెచ్చిన ఈ మార్పులను చూసిన లాస్ట్ అటెంప్ట్ అభ్యర్థులు నీరుగారిపోతున్నారు. అయితే వీరికి నిపుణులు ఇస్తున్న సలహా ఏంటంటే..‘ఇప్పటివరకు తమకున్న ప్రిపరేషన్ అనుభవాన్ని జనరల్ స్టడీస్‌కు బదలాయించుకుని.. సిలబస్‌ను పరిశీలించి గత జీఎస్ పేపర్లను పరిశీలించుకుంటూ ముందుకు సాగాలి. ఇప్పటివరకు రెండు ఆప్షనల్స్ కోణంలో ప్రిపరేషన్ సాగించిన అభ్యర్థులు.. ఇప్పుడు ఒకే ఆప్షనల్ విధానం కారణంగా తమకు పట్టున్న ఆప్షనల్‌నే ఎంచుకోవాలి. రెండో ఆప్షనల్‌కు కేటాయించే సమయాన్ని జనరల్ స్టడీస్‌కు బదిలీ చేసుకోవాలి.’
తాజా అభ్యర్థులు వేచి చూడటం మేలు
‘వయోపరిమితి పరంగా, అటెంప్ట్‌ల పరంగా ఇప్పటికీ అవకాశం ఉన్న అభ్యర్థులు, తాజా గ్రాడ్యుయేట్లు ఈ ఏడాదికి అటెంప్ట్ ఇవ్వకపోవడమే మంచిది’ అంటున్నారు అనుభవజ్ఞులు. కొత్త సిలబస్ ప్రకారం ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకొని.. ఈ ఏడాది నిర్వహించే పరీక్ష పేపర్‌ను పరిశీలించి.. వచ్చే నోటిఫికేషన్‌కు స్పందిస్తే సానుకూలంగా ఉంటుందంటున్నారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అభ్యర్థులకు అదనపు ప్రయోజనం
ఈ ఏడాది యూపీఎస్సీ చేపట్టిన మరో ప్రధాన సంస్కరణ.. సైన్స్, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతగా నిర్వహించే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షకు కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నిర్వహించాలని నిర్ణయించడం. అది కూడా సివిల్స్ ప్రిలిమ్స్‌తో కలపడం. దీంతో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అభ్యర్థులు సివిల్స్ ప్రిలిమ్స్‌ను పూర్తి చేసుకుంటే తదుపరి దశలో.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్‌తోపాటు సివిల్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్‌కు కూడా అర్హత పొందుతారు. ఇప్పటివరకు కేవలం రెండంకెల సంఖ్యలో ఉండే ఫారెస్ట్ సర్వీస్ పోస్టులకు పోటీ పడే వేల మంది సైన్స్, ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఈ పరిణామం కచ్చితంగా అదనపు ప్రయోజనమే.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2013 సమాచారం
మొత్తం ఖాళీలు: 1000
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
వయో పరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులు 21 నుంచి 30 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు)
దరఖాస్తు విధానం: కేవలం ఆన్‌లైన్‌లోనే (వెబ్‌సైట్: www.upsconline.nic.in)
దరఖాస్తు ఫీజు: రూ. 100 (ఆన్‌లైన్ లేదా బ్యాంక్ చలాన ద్వారా చెల్లించొచ్చు. ఎస్సీ, ఎస్టీలకు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు)
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
మెయిన్స్ ఎగ్జామినేషన్: నవంబర్/డిసెంబర్, 2013
వెబ్‌సైట్: www.upsc.gov.in, www.sakshieducation.com
చదవాల్సిన పుస్తకాలు
ప్రస్తుత సిలబస్ అధిక శాతం కాంటెపరరీ బేస్డ్‌గా, కోర్‌కు తక్కువ ప్రాధాన్యంగా ఉంది. దీంతో అభ్యర్థులు ముందుగా..

- ఆయా సబ్జెక్టుల్లో బేసిక్స్‌పై పట్టు కోసం ఎన్‌సీఈఆర్‌టీ ఆరు నుంచి 12వ తరగతి పుస్తకాలు చదవాలి.
- ఆ తర్వాత సంబంధిత సబ్జెక్టుల్లో అన్ని అంశాలు కవరయ్యే ఒకట్రెండు పుస్తకాలు చదవాలి.
- ఇలా కోర్ బేసిక్స్‌పై అవగాహన ఏర్పరచుకుని వాటిని నిత్యజీవిత సంఘటనలతో అన్వయించుకునేలా నిరంతరం ప్రామాణిక దిన పత్రికలు చదవాలి.
- కాంటెంపరరీ అంశాలపై పట్టు కోసం ఆయా డిపార్ట్‌మెంట్‌లు విడుదల చేసే డ్రాఫ్ట్ పాలసీలను అనుసరించాలి.
- ఇక నుంచి యోజన, ఇండియా ఇయర్ బుక్ వంటివి క్రమం తప్పకుండా చదవాలి.
మార్పులు స్పష్టమయ్యాయి. షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ‘మార్పులు-సాధ్యాసాధ్యాల’ గురించి ఆలోచిస్తూ కాలం వృథా చేసుకోకుండా కార్యోన్ముఖులు కావాల్సిందే.
ఇందుకోసం నిపుణులు అందిస్తున్న సలహాలు:
- ముందుగా ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్‌పై దృష్టిసారించాలి. ఇందుకోసం ఆయా ప్రామాణిక దినపత్రికలు నిరంతరం చదవాలి. వాటిలోని ప్రధానాంశాలను సిలబస్ కోణంలో పరిశీలించడంతోపాటు.. సదరు వ్యాసంలో వాక్య నిర్మాణ శైలి, వినియోగించిన పదజాలం తదితర అంశాలపై దృష్టి సారించాలి. ఇంగ్లిష్‌లో భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
- మెయిన్స్‌లో పేర్కొన్న అత్యధిక శాతం అంశాలు ప్రిలిమ్స్ పేపర్-1లోనూ ఎదురవుతాయి. ఒక్కటే తేడా ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మెయిన్స్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్, మెయిన్స్ అనుసంధానం చేసుకుంటూ సాగాలి. ముఖ్యంగా కొత్త సిలబస్ నేపథ్యంలో ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్‌పై దృష్టి పెడదామనే ధోరణి సరికాదు. అలా ఆలోచిస్తే మే 26న జరిగే ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్ పరీక్షల (నవంబర్/డిసెంబర్) సమయానికి అన్ని అంశాలపై పరిపూర్ణత అసాధ్యం. కాబట్టి ప్రిలిమినరీ దశ నుంచే రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి.
- ముందుగా ఆయా అంశాల సిలబస్‌ను పరిశీలించి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలో ఉన్న అంశాలను మెయిన్స్ కోసం డిస్క్రిప్టివ్ కోణంలో చదువుతూ.. వాటిలోని ముఖ్యాంశాలను ప్రిలిమ్స్ కోణంలో పాయింట్స్ రూపంలో రాసుకోవాలి.
- ప్రస్తుత సిలబస్ అధిక శాతం సమకాలీన అంశాల ప్రాధాన్యంగా ఉన్న నేపథ్యంలో.. మీడియా, ఇతర ప్రసార సాధనాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనునిత్యం చోటుచేసుకుంటున్న ప్రముఖ పరిణామాలను పరిశీలించాలి. అంతేకాకుండా వాటిపై దినపత్రికలు, ఇతర మ్యాగజైన్లలో నిపుణులు రాసే వ్యాసాలు, వాటిలోని ముఖ్యాంశాలను ఒకచోట రాసుకోవాలి. వీటిని సబ్జెక్ట్‌లోని కోర్ అంశాల బేసిక్స్‌కు అనుసంధానం చేసుకుని చదివితే ఒకే సమయంలో అటు కోర్ కాన్సెప్ట్స్‌పై.. ఇటు కాంటెంపరరీ అంశాలపై అవగాహన ఏర్పడుతుంది.
- కోర్ అంశాలను చదివేటప్పుడు కూడా వాటిని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకుంటూ అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో సాగితే సత్ఫలితాల సాధనకు ఆస్కారం ఉంటుంది.
- హిస్టరీ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు.. అన్ని సబ్జెక్టుల్లో అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యం పెరగడంతో.. ఇంటర్నెట్, సోషల్ నెట్‌వర్కింగ్ మీడియాలను ఆధారంగా చేసుకుని సమాచార సేకరణ చేసుకోవాలి.
- కామన్ సిలబస్‌కు పెద్దపీట వేయడం. కొన్ని ఆప్షనల్స్‌కే అనుకూలమనే అభిప్రాయాలకు స్వస్తి.
- అందరికీ సమాన అవకాశాలు అనే విధానానికి ప్రాధాన్యం ఇవ్వడం.
- అన్ని పేపర్ల మధ్య అంతర్గత సంబంధం ఉండటం.
- సిలబస్‌లోని అంశాలను నిర్దిష్టంగా పేర్కొనడం.
- కాంటెంపరరీకి ప్రాధాన్యం. నిజమైన ఔత్సాహికులకు అనుకూలం.
- తెలుగు మీడియం, తెలుగు ఆప్షనల్ ఎంపిక విషయంలో ఆంక్షలు.
- రిఫరెన్స్ రిసోర్సెస్ ప్రకటించకపోవడం.
- సమాన అవకాశాలు అంటూనే గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు చేదు మాత్రగా ఇంగ్లిష్ కంపల్సరీ కావడం.
- పేపర్ల మధ్య అంతర్గత అంశాలను సమీకృతం చేసుకోవడం కష్టం.
- నిపుణులు, మేధావులు, అభ్యర్థులను సంప్రదించకుండా అకస్మాత్తుగా మార్పులు.
- ప్రిలిమినరీ తేదీ (మే 26) తర్వాత మెయిన్స్‌కు లభించే సమయంలో.. అన్ని అంశాలపై పరిపూర్ణత అసాధ్యం.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర సర్వీసుల్లో ఖాళీల భర్తీకి నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎంపిక విధానం మూడు దశల్లో (ప్రిలిమినరీ,మెయిన్స్ ఎగ్జామినేషన్,పర్సనాలిటీ టెస్ట్). దశలవారీగా పేపర్లు, మార్కుల వివరాలు..
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ విధానం)
పేపర్ | మార్కులు | సమయం |
జనరల్ స్టడీస్-1 | 200 | 2 గంటలు |
జనరల్ స్టడీస్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్) | 200 | 2 గంటలు |
మెయిన్స్ ఎగ్జామినేషన్:
క్వాలిఫైయింగ్ సబ్జెక్టులు
పేపర్-1 300 మార్కులు - ఏదైనా భారతీయ భాష
పేపర్-2 300 మార్కులు - ఇంగ్లిష్
తప్పనిసరి సబ్జెక్టులు
పేపర్-2 300 మార్కులు - ఇంగ్లిష్
తప్పనిసరి సబ్జెక్టులు
పేపర్ సంఖ్య | పేపర్ పేరు | మార్కులు | సమయం |
1 | ఎస్సే | 250 | 3 గంటలు |
2 | జనరల్ స్టడీస్-1 (ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ, అండ్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ సొసైటీ | 250 | 3 గంటలు |
3 | జనరల్ స్టడీస్-2 (గవర్నెన్స్, కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్) | 250 | 3 గంటలు |
4 | జనరల్ స్టడీస్-3 (టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్‌మెంట్, బయో డైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్) | 250 | 3 గంటలు |
5 | జనరల్ స్టడీస్-4 (ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్) | 250 | 3 గంటలు |
6 | ఆప్షనల్ పేపర్-1 | 250 | 3 గంటలు |
7 | |||
ఆప్షనల్ పేపర్-2 | 250 | 3 గంటలు | |
మెయిన్స్ మార్కులు | 1750 | ||
పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) | 275 | ||
మొత్తం మార్కులు | 2025 |
గమనిక: నోటిఫికేషన్‌లో గ్రూప్ -1 విభాగంలో పేర్కొన్న 25 సబ్టెక్టులు, గ్రూప్-2 విభాగంలో పేర్కొన్న ఆయా భాషా సాహిత్యాల సబ్జెక్టుల నుంచి ఏదైన ఒక పేపర్‌ను ఆప్షనల్‌గా (రెండు గ్రూప్‌లు కలిపి) ఎంచుకోవాలి. గ్రూప్-1 విభాగంలోని సబ్జెక్టులను ఎవరైనా ఎంచుకోవచ్చు. కానీ గ్రూప్-2లో పేర్కొన్న భాషా సాహిత్యాలను ఎంచుకోవాలంటే సంబంధిత సబ్జెక్టును ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ స్థాయిలో చదివుండాలి.
#Tags