అన్వేషణ ఫలితాలకు అక్షరరూపం
సివిల్స్ పరీక్ష ప్రస్తుత ధోరణిని పరిశీలిస్తే వివిధ పేపర్లలోని ప్రశ్నలు ఎక్కువగా సమకాలీన సవాళ్లు (Contemporary Challenges), వివిధ అంశాలకు సంబంధించిన భావనల ఆధారంగా ఉంటున్నాయి. ఈసారి ఎస్సే పేపర్‌లో కూడా ఇదే రకమైన ధోరణిని ఆశించవచ్చు. అభ్యర్థులు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి.
తొలుత
ఎస్సేకు సంబంధించి అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాల్సిన మరో విషయం సమయ పాలన. అందుబాటులో ఉన్న సమయంలో మూడింట ఒక వంతును వ్యాసంలో పొందుపరచాల్సిన అంశాలు ఏమిటి? రూపం ఎలా ఉండాలి? అనే ప్రణాళికను రూపొందించుకునేందుకు కేటాయించాలి. మిగిలిన 2/3 వంతు సమయంలో ఎస్సే పూర్తిచేయాలి. ప్రతి 15 నిమిషాలకు 150-200 పదాలు రాసేలా ప్రణాళిక వేసుకోవాలి. దీనికి తగ్గట్టు ప్రస్తుతం ఎస్సేలను ప్రాక్టీస్ చేయాలి. పశ్నలో ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే ఆ సమస్యకు మూలాలు ఏమిటి?; పూర్వ, ప్రస్తుత స్థితి; సమస్య పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు-వ్యూహాలు; అవి ఎంత వరకు సఫలీకృతమయ్యాయి? వంటి అంశాలతో ప్రణాళిక రూపొందించుకోవాలి.
‘ప్రారంభం’లో మెరవాలి
ఎంపిక చేసుకున్న ఏదైనా అంశంపై మెరుగైన స్థాయిలో అవగాహన ఉన్నప్పటికీ, ఎలా మొదలుపెట్టాలన్నది తెలియక సతమతమవుతారు. దీనివల్ల సమయం వృథా అవుతుంది. అందువల్ల ఎస్సేను ప్రారంభించేటప్పుడే సమకాలీన శైలికి ప్రాధాన్యమివ్వాలి. ప్రశ్నకు సంబంధించి ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాన్ని ప్రస్తావిస్తూ ఎస్సేను ప్రారంభించవచ్చు. ఉదాహరణకు భారత అంతరిక్ష విజయాలకు సంబంధించిన ఎస్సే అయితే మంగళ్‌యాన్, సొంత జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు దిశగా భారత్ ప్రయోగాలతో ప్రారంభించొచ్చు.
సరళ పదజాలం
ఎంత బాగా చదివినా, వివిధ అంశాలపై ఎంత పరిజ్ఞానం సంపాదించినా రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే ప్రతికూల ఫలితమే ఎదురవుతుంది. గ్రాంథిక భాష కఠిన పదజాలం ఉపయోగిస్తేనే మంచి ఎస్సే అనిపించుకుంటుందనే అపోహ ఉంది. ఓ సంక్లిష్ట సమస్యకు సరళమైన పరిష్కారాలను ఎగ్జామినర్ అభ్యర్థి నుంచి ఆశిస్తాడు. ఇలాంటి పరిస్థితిలో సంక్లిష్టమైన సమస్యను, దాని మూలాలను, పరిష్కార మార్గాలను సరళ పదజాలంతో వివరించగలిగితే మంచి స్కోర్ సాధించడం ఖాయం. ఓ మేధావితో సంభాషిస్తున్నట్లు ఎస్సే ఉండాలి. అలాంటి ఎస్సే ఎగ్జామినర్‌ను కట్టిపడేస్తుంది.
గుర్తుంచుకోండి
- ప్రిపరేషన్‌లో భాగంగా తొలుత ఎస్సే ప్రశ్నలు ఏ విభాగాల నుంచి వచ్చే అవకాశముందో గుర్తించాలి. సాధారణంగా భారత దేశం- సామాజిక, ఆర్థిక అంశాలు; పర్యావరణం, అంతర్జాతీయ వ్యాపారం, సైన్స్ అండ్ టెక్నాలజీ; అంతర్జాతీయ సంబంధాలు; ముఖ్యమైన తాత్విక భావనలు (Core concepts in Philosophy) విభాగాల నుంచి ప్రశ్నలు తప్పకుండా వస్తున్నాయి.
- పైన చెప్పిన విభాగాల్లో ఒక్కో దాన్నుంచి రెండు, మూడు అంశాలను గుర్తించాలి. ఈ అంశాల నుంచి ఏ కోణంలో ప్రశ్న వస్తుందన్నది తెలుసుకోవడం ముఖ్యం. ఈ విషయంలో చాలా మంది అభ్యర్థులు తప్పులు చేస్తున్నారు. ‘స్థూల అంశం నుంచి సూక్ష్మ ప్రశ్న’ అనే విధానంలో ప్రశ్నలు వస్తున్నాయి. ఎవరైతే ఈ సూక్ష్మ కోణంపై పట్టు సాధిస్తారో వారిదే విజయం అనడంలో సందేహం లేదు.
- గతంలో మాదిరి ఎస్సేలు నేరుగా రావడం లేదు. అందువల్ల వివిధ అంశాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముందో తెలుసుకోవడంలో సబ్జెక్టు నిపుణుల సలహా తీసుకోవాలి. మొత్తంమీద కనీసం 10 ఎస్సేలను ప్రాక్టీస్ చేయడం మంచిది. రాసిన ఎస్సేలను నిపుణులతో దిద్దించుకోవాలి. చేసిన పొరపాట్లను గుర్తించి, మరింత సమర్థవంతంగా రాసేందుకు ప్రయత్నించాలి. ప్రాక్టీస్ చేసిన ప్రశ్నల నుంచి కాకుండా, వేరేది వచ్చినప్పటికీ సంపాదించిన అనుభవం ద్వారా ఆ ప్రశ్నకు కూడా ఎస్సే బాగా రాయొచ్చు.
- వివిధ అంశాలకు సంబంధించిన సమకాలీన సమస్యలు, సవాళ్లు, కారణాలు, ప్రభుత్వ చర్యలు, సమస్య పరిష్కారానికి అనుసరించే వ్యూహాలపై పట్టు సాధించాలి. వీటికి అభ్యర్థులు ప్రభావవంతమైన, సానుకూల దృక్పథంతో కూడిన సొంత అభిప్రాయాలను జోడిస్తూ నోట్స్ రూపొందించుకోవాలి. ఒక సమస్యపై అవగాహన ఏర్పరుచుకొని, విశ్లేషించి, సరైన పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని అభ్యర్థుల నుంచి ఎగ్జామినర్ ఆశిస్తున్నాడు కాబట్టి ఎస్సే ప్రిపరేషన్ కూడా ఇదే విధంగా ఉండాలి.
‘ప్రారంభం’లో మెరవాలి
ఎంపిక చేసుకున్న ఏదైనా అంశంపై మెరుగైన స్థాయిలో అవగాహన ఉన్నప్పటికీ, ఎలా మొదలుపెట్టాలన్నది తెలియక సతమతమవుతారు. దీనివల్ల సమయం వృథా అవుతుంది. అందువల్ల ఎస్సేను ప్రారంభించేటప్పుడే సమకాలీన శైలికి ప్రాధాన్యమివ్వాలి. ప్రశ్నకు సంబంధించి ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాన్ని ప్రస్తావిస్తూ ఎస్సేను ప్రారంభించవచ్చు. ఉదాహరణకు భారత అంతరిక్ష విజయాలకు సంబంధించిన ఎస్సే అయితే మంగళ్‌యాన్, సొంత జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు దిశగా భారత్ ప్రయోగాలతో ప్రారంభించొచ్చు.
సరళ పదజాలం
ఎంత బాగా చదివినా, వివిధ అంశాలపై ఎంత పరిజ్ఞానం సంపాదించినా రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే ప్రతికూల ఫలితమే ఎదురవుతుంది. గ్రాంథిక భాష కఠిన పదజాలం ఉపయోగిస్తేనే మంచి ఎస్సే అనిపించుకుంటుందనే అపోహ ఉంది. ఓ సంక్లిష్ట సమస్యకు సరళమైన పరిష్కారాలను ఎగ్జామినర్ అభ్యర్థి నుంచి ఆశిస్తాడు. ఇలాంటి పరిస్థితిలో సంక్లిష్టమైన సమస్యను, దాని మూలాలను, పరిష్కార మార్గాలను సరళ పదజాలంతో వివరించగలిగితే మంచి స్కోర్ సాధించడం ఖాయం. ఓ మేధావితో సంభాషిస్తున్నట్లు ఎస్సే ఉండాలి. అలాంటి ఎస్సే ఎగ్జామినర్‌ను కట్టిపడేస్తుంది.
గుర్తుంచుకోండి
- ఎస్సే అనేది అభ్యర్థి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిద్వారా భావాలు, ఆలోచనా ధోరణి, విలువలు, వైఖరి, భావప్రసార సామర్థ్యం వంటివన్నీ బయటపడతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్సే రాయాలి.
- ఎస్సేలో సోపానాలు: ప్రారంభం, నేపథ్యం-చారిత్రక అంశాలు, అంశానికి సంబంధించిన ప్రధాన భావనలు, అనుకూలతలు, ప్రతికూలతలు, సమస్యల పరిష్కారానికి సూచనలు, ముగింపు.
- ఎస్సే రాయడంలో సమతూకం పాటించడం చాలా ప్రధానం. ప్రశ్నలో అడిగిన అంశానికి సంబంధించి వివిధ పార్శ్వాలు ప్రతిబింబించేలా సమాధానం రాయాలి. ఏదో ఒక కోణాన్ని మాత్రమే ప్రస్తావించి వదిలేయకూడదు.
- సరైన సమాచారాన్ని పొందుపరిచేందుకు, సమకాలీన ఉదాహరణలతో విశ్లేషణాత్మకంగా రాసేందుకు అవకాశమున్న ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే మంచి స్కోర్ సాధించేందుకు అవకాశముంటుంది.
- చాలా ముఖ్య అంశమైతే తప్ప అండర్‌లైన్ చేయొద్దు. అవసరమైతే పేజీకి ఒక అండర్‌లైన్ ఉండేలా చూసుకోవాలి.
- సందర్భానుసారం అవసరమైనంతలో కొటేషన్స్ ఉపయోగించొచ్చు. అంతేగానీ పొంతనలేని కొటేషన్స్ వల్ల లాభం మాట అటుంచి నష్టం ఎక్కువ జరుగుతుంది.
- ఎస్సేను పేరాగ్రాఫ్‌లుగా విభజించుకొని రాయాలి. ఒక పేరాగ్రాఫ్ ఒకే అంశానికి సంబంధించినదై ఉండాలి. ఒక పేరాకు, తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి.
- ఎస్సేలో పాయింట్లు ఉండకూడదు.. టేబుల్ వేయకూడదు.. అనేవి అపోహలు మాత్రమే. సందర్భాన్నిబట్టి అవసరమైన చోట సమాచారాన్ని పాయింట్ల రూపంలో రాయొచ్చు. వెన్ డయాగ్రమ్‌ల వంటివీ వేయొచ్చు.
- రాజ్యాంగ సూత్రాలకు, లౌకిక వాదానికి, దేశ సమగ్రతకు వ్యతిరేకంగా అభిప్రాయాలు ఉండకూడదు. మతం, కుల దూషణలకు పాల్పడకూడదు. వ్యక్తిగత విమర్శలకు తావివ్వకూడదు.
- ఎస్సే ముగింపు ఆశావహ దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి. నిరాశ, నిస్పృహలను ప్రతిబింబించకూడదు. ఇచ్చే పరిష్కారాలు ఆచరణ సాధ్యంగా ఉండాలి. ప్రారంభ ఎత్తుగడకు, ముగింపునకు సంబంధం ఉండేలా చూసుకోవాలి.
- పశ్చిమాఫ్రికాలో విజృంభించడం ప్రారంభించి, తర్వాత ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా మహమ్మారికి సంబంధించి ‘ఎబోలాను ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధమవుతున్న తీరు’పై ప్రశ్న రావొచ్చు.
- చైనాతో ఆర్థిక సంబంధాల బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు.. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే కోణంలో ప్రశ్న అడగొచ్చు.
- Social im-pact of mobile phones
- Asian century pro-spe-cts and problems
- Does Presidential system suit India more?
- The importance of creative freedom
- Children's rights: The real foundation for social progress
- Indian youth is a gift to the world
- There is a crying need to revive SAARC
- Have regional parties delivered?
- Inter-linking of rivers
- smart cities; cleanliness as a behavioural challenge.
- Creation of Smaller-States and the consequent administrative, economic and developmental implications.
- Does Indian Cinema shape our popular culture or merely reflect it?
- Credit based higher education system status, oppurtunities and challenges
- In the Indian context, both human intelligence and technical intelligence are crucial in combating terrorism.
- In the context of Gandhiji's views on the matter, explore, on an evolutionary scale, the terms 'Swadhinata', 'Swaraj' and 'Dharmarjya'. Critically comment on their contemporary relevance to the Indian democracy.
- Is the criticism that the Public-Private-Partnership (PPP) model for development is more of a bane than boon in the Indian context, justified?
- Science and Mysticism: Are they compatible?
- Managing work and home: is the Indian working woman getting a fair deal?
- Be the change you want to see in others - Gandhiji.
- Is the Colonial mentality hindering India's success?
- GDP (Gross Domestic Product) along with GDH (Gross Domestic Happiness) would be the right indices for judging the well - being of a country.
- Science and Technology is the panacea for the growth and security of the nation.
#Tags