TS LAWCET 2024 Results Declared,Check Direct Link: తెలంగాణ లాసెట్‌ ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్‌ ఇలా చెక్‌ చేసుకోండి

తెలంగాణ లాసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఓయూ ఇన్‌ఛార్జి వీసీ ఎం.దానకిశోర్‌ లాసెట్‌,పీజీఎల్‌సెట్-2024 ఫలితాలను రిలీజ్‌ చేశారు. అభ్యర్థులు results.sakshieducation.comను క్లిక్‌ చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది జూన్ 3వ తేదీన లాసెట్‌ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

మొత్తంగా మూడు సెషన్లలో పరీక్షను నిర్వహించారు. టీఎస్‌ లాసెట్‌ పరీక్ష ద్వారా ఎల్‌ఎల్‌బీతో పాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఈ పరీక్షను హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. 

TG LAWCET & PG LCET 2024 ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి..

* ముందుగా సాక్షి ఎడ్యుకేషన్‌ రిజల్ట్‌ వెబ్‌సైట్ ‌results.sakshieducation.comను క్లిక్‌ చేయండి. 
* హోం పేజీలో కనిపిస్తున్న లాసెట్‌, PGLCET రిజల్ట్‌ లింక్‌పై క్లిక్‌ చేయండి. 
* తర్వాతి పేజీలో మీ హాల్‌టికెట్‌ వివరాలు ఎంటర్‌ చేయండి
* మీకు మార్కులతో పాటు ర్యాంకు కూడా డిస్‌ప్లే అవుతుంది
* ప్రింట్ డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా కాపీని పొందవచ్చు.
* భవిష్యత్ సూచన కోసం టెట్ స్కోర్ కార్డ్ కాపీని జాగ్రత్తగా ఉంచుకోవాలి.

TG LAWCET & PG LCET 2024 ఫలితాల కోసం TS Lawcet & PGLCET Results 2024 - Download Telangana Lawcet 2024 Rank Card, Marks List- Sakshieducation.com డైరెక్ట్‌ లింక్‌ను క్లిక్‌చేయండి. 

#Tags