Rules of Legal Education: ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఈ డిగ్రీ తప్పనిసరి: హైకోర్టు

సాక్షి ఎడ్యుకేష‌న్: మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు చేయడానికి రెగ్యులర్ డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. బార్ కౌన్సిల్ రూపొందించిన లీగల్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం రెగ్యులర్ డిగ్రీ అవసరమేనని తేల్చిచెప్పింది.

దూర విద్య, కరస్పాండెన్స్ కోర్సులో డిగ్రీ ఉన్నప్పటికీ ఉస్మా నియా యూనివర్సిటీ లా డిగ్రీ సీటును ఇవ్వకపోవ డాన్ని పలువురు అభ్యర్థులు సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సింగిల్ జడ్జి కొట్టివేశారు.

చదవండి: లాసెట్ - స్టడీ మెటీరియల్ | లా ఆప్టిట్యూడ్ | అర్థిమేటిక్ | రీజనింగ్ | గైడెన్స్‌ | కరెంట్‌ అఫైర్స్ | జనరల్‌ నాలెడ్జ్‌

దీనిపై అప్పీళ్లు దాఖలు చేయగా ప్రధాన న్యాయమూర్తి ధర్మా సనం తీర్పు వెలువరిస్తూ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి రెగ్యు లర్ డిగ్రీ అవసరమని పేర్కొంది. మధ్యంతర ఉత్త ర్వుల ద్వారా ఎల్‌ఎల్‌బీలో సీట్లు పొంది ఇప్పటికే కోర్సు పూర్తయిన వారున్నారని, అయితే మధ్యంతర ఉత్తర్వుల ద్వారా వారికి ఎలాంటి హక్కులు వర్తించ బోవని స్పష్టం చేస్తూ పిటిషన్లను కొట్టివేసింది. 

#Tags