TG LAWCET 2024 Counseling Schedule: లా ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: లాసెట్, పీజీ లాసెట్‌ అడ్మిషన్ల కౌన్సె­లింగ్‌ ఆగస్టు 5 నుంచి మొదలవుతుంది.

ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి నేతృత్వంలోని ‘సెట్‌’ ప్రవే శాల కమిటీ సమా వేశం జూలై 12న‌ మండలి కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

చదవండి: International Law: పాలస్తీనాను అధీనంలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం

బుధవారం లాసెట్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సమా వేశంలో మండలి వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ ఎస్‌కే మహమూద్, ప్రొఫెసర్‌ వి.వెంకటరమణ, కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్, సెట్‌ కన్వీనర్‌ పి.రమేష్‌బాబు పాల్గొన్నారు.

చదవండి: Job Reservation Bill: రాష్ట్రాన్ని విడిచివెళ్లనున్న టెక్ కంపెనీలు.. కార‌ణం ఇదే..

రాష్ట్రంలోని 11 లా కాలేజీలు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొంటాయి. వీటిలో మూడేళ్ల లా కోర్సులో 4,790 సీట్లు, ఐదేళ్ల లా కోర్సులో 2,160, ఎల్‌ఎల్‌ఎంలో 990 సీట్లున్నాయి. 

లా ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

తేదీ

విషయం

24–7–24

నోటిఫికేషన్‌ విడుదల

5–8–24 – 20–8–24

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన

7–8–24 – 10–8–24

స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

21–8–24

అర్హుల జాబితా ప్రకటన, మార్పులు చేర్పులకు అవకాశం

22–8–24 – 23–8–24

తొలి విడతకు ఆప్షన్లు ఇవ్వడం

24.8.24

ఆప్షన్లు ఎడిట్‌ చేసుకునేందుకు అవకాశం

27–8–24

సీట్ల కేటాయింపు

28–8–24 – 30–8–24

కాలేజీలో రిపోర్టింగ్‌

#Tags