LAWCET 2023: లాసెట్‌ దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

ఏఎన్‌యూ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏపీ లాసెట్, ఏపీ పీజీ లాసెట్‌ –2023కు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్‌ 22వ తేదీ వరకు గడువు ఉందని ఏపీ లాసెట్‌–2023 కన్వీనర్‌ ఆచార్య బి.సత్యనారాయణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
లాసెట్‌ దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

రూ.500 ఆలస్య రుసుంతో ఈ నెల 29వ తేదీ వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో మే నెల 5వ తేదీ వరకు, రూ. 2వేలు ఆలస్య రుసుంతో మే 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తుల్లోని తప్పులను మే నెల 10, 11 తేదీల్లో సరిచేసుకోవచ్చని తెలిపారు. లాసెట్‌ ప్రవేశ పరీక్ష మే నెల 20వ తేదీన జరుగుతుందని పేర్కొన్నారు. మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు చదివేందుకు డిగ్రీ లేదా పీజీ కోర్సులను ఓసీ కేటగిరీ అభ్య­ర్థులు 45 శాతం మార్కులతోను, బీసీ కేటగిరీ అభ్యర్థులు 42 శాతం మార్కులతోను, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు 40 శాతం మార్కు­లతోను ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు.

చదవండి: లాసెట్ - స్టడీ మెటీరియల్ | లా ఆప్టిట్యూడ్ | అర్థిమేటిక్ | రీజనింగ్ | గైడెన్స్‌ | కరెంట్‌ అఫైర్స్ | జనరల్‌ నాలెడ్జ్‌

ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు చదివేందుకు ఇంటర్మీడియట్‌ కోర్సును ఓసీ కేటగిరీ అభ్యర్థులు 45 శాతం మార్కులతోను, బీసీ కేటగిరీ అభ్యర్థులు 42 శాతం మార్కులతోను, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు 40 శాతం మార్కులతోను ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొ­న్నారు. ఎల్‌ఎల్‌ఎం కోర్సు చదవాలనుకునే విద్యార్థులు ఎల్‌ఎల్‌బీ మూడు లేదా ఐదు సంవత్సరాల కోర్సు ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు.

#Tags