Work From Home: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కి ముగింపు పలికిన అమెజాన్‌.. ఆఫీస్‌ నుంచే పని చేయాలని ఆదేశం

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతికి దాదాపు అన్ని కంపెనీలు ముగింపు పలుకుతున్నాయి. అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం అమెజాన్‌ కూడా దీనికి సంబంధించి తాజాగా ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్‌ నుంచే పని చేయాలని ఉద్యోగులను ఆదేశించింది.

National Scholarship: నేషనల్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారా? డెడ్‌లైన్‌ ఇదే

ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని అమెజాన్‌ డాట్‌ కామ్‌ తెలిపింది. ఇది 2025 జనవరి 2 నుండి అమలులోకి వస్తుంది. "యూఎస్ ప్రధాన కార్యాలయ స్థానాలు (పుగెట్ సౌండ్, ఆర్లింగ్టన్)తో సహా పలు చోట్ల గతంలో మాదిరే డెస్క్ ఏర్పాట్లను తిరిగి తీసుకురాబోతున్నాము" అని సీఈవో ఆండీ జాస్సీ ఉద్యోగులకు ఒక నోట్‌లో తెలిపారు.

SBI Jobs 2024 : ఎస్‌బీఐలో 1497 స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌... చివరి తేదీ ఇదే

సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా 2025 మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి మేనేజర్‌లు, ఉద్యోగుల నిష్పత్తిని కనీసం 15% పెంచాలని అమెజాన్‌ చూస్తోంది. గత ఏడాది మేలో అమెజాన్ సీటెల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు వాతావరణ విధానం, తొలగింపులు, రిటర్న్‌ టు ఆఫీస్‌ ఆదేశాలను నిరసిస్తూ వాకౌట్ చేశారు.

#Tags