Mega Job Mela: జాబ్‌ మేళాలో 52 కంపెనీలు... 1500 ఉద్యోగాలు

ములుగు రూరల్‌: నిరుద్యోగులు తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఉద్దేశంతో మెగా జాబ్‌ మేళా నిర్వహించామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు.

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ జన్మదినం సందర్భంగా బుధవారం ములుగు మండలం ఇంచర్ల పంచాయతీ పరిధిలోని ఎంఆర్‌ గార్డెన్‌లో మెగాజాబ్‌ మేళా నిర్వహించారు. ఇందులో 52 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ జాబ్‌ మేళాలో 1500 మంది ఎంపిక కాగా వారికి నియామక పత్రాలు అందించారు. జాబ్‌మేళాను ప్రారంభించిన అనంతరం మంత్రి సీతక్క మాట్లాడారు. జాబ్‌ మేళాలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసి పేరు తెచ్చువాలన్నారు. ములుగు జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ టీఎస్‌ దివాకర్‌ మాట్లాడుతూ ఉద్యోగం ఏదైనా ఇష్టపడి చేయాలన్నారు. అప్పుడే అవకాశాలు వాటంతట అవే వస్తాయన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జాబ్‌ మేళా నిర్వహించిన మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శబరీష్‌, అదనపు కలెక్టర్‌ శ్రీజ పాల్గొన్నారు.
 

Good News For 10th Pass Candidates : గుడ్‌న్యూస్‌.. ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌లోనే 50000 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. త్వ‌ర‌లోనే..

#Tags