CWC Recruitment Notification : సీడబ్యూసీలో 179 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఈ విద్యార్హతతోనే..
సాక్షి ఎడ్యుకేషన్: సీడబ్యూసీ.. సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అధికారులు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ను కూడా విడుదల చేశారు. ఈ సీడబ్యూసీ రిక్రూట్‌మెంట్‌తో ఖాళీలుగా ఉన్న మొత్తం 179 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Faculty Jobs: ఎంజీయూ నల్గొండలో 14 పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
పోస్టుల వివరాలు:
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ మేనేజ్‌మెంట్ ట్రైనీ, అకౌంటెంట్, సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్.
విద్యా అర్హత:
మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్) - హెచ్‌ఆర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, మార్కెటింగ్ లేదా సంబంధిత రంగంలో ఫస్ట్ క్లాస్‌తో ఎంబీఏ డిగ్రీ ఉండాలి.
మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) - ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూషన్ నుండి అగ్రికల్చర్, ఎంటమాలజీ, మైక్రోబయాలజీ లేదా సంబంధిత రంగంలో ఫస్ట్ క్లాస్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి.
అకౌంటెంట్ - బీ. కామ్, సీఏ/ఐసీడబ్యూఏ లేదా తత్సమాన అర్హత కనీసం మూడు సంవత్సరాల అనుభవం.
సూపరింటెండెంట్- ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి.
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- అభ్యర్థులు అగ్రికల్చర్, జువాలజీ, కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీలో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
వయోపరిమితి:
మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్) - 28 సంవత్సరాలు
మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) - 28 సంవత్సరాలు
అకౌంటెంట్ - 30 సంవత్సరాలు
Apprenticeship Mela: రేపు అప్రెంటిస్‌షిప్ మేళా.. ఇంటర్వ్యూలో ఎంపికైతే నెలకు రూ.15,000/-
సూపరింటెండెంట్ - 30 సంవత్సరాలు
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 28 సంవత్సరాలు
ఎంపిక ప్రక్రియ:
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌లో ఎంపిక క్రింది దశల ప్రకారం జరుగుతుంది.
రాత పరీక్ష: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ వంటి అంశాలను కవర్ చేస్తుంది. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
దరఖాస్తు రుసుము:
ఎస్సీ/ఎస్‌టీ, స్త్రీ, పీడబ్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: రూ. 500 (ఇంటిమేషన్ ఛార్జీలు)
జనరల్, ఓబీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: రూ. 1,350 (దరఖాస్తు-సమాచార రుసుము)
దరఖాస్తుల విధానం/చివరి తేదీ:
cewacor.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోండి.
దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైంది. 12 జనవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.