Job Mela : రేపే జాబ్ మేళా.. వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి విద్యార్హ‌త‌లివే.. ఎక్క‌డంటే!

నిరుద్యోగుల‌కు శుభ‌వార్తే ఇది.. రేపు మంచిర్యాల‌లో మినీ జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా ఉపాధి అధికారి రవికృష్ణ ప్ర‌క‌టించారు.

సాక్షి ఎడ్యుకేష‌న్: నిరుద్యోగుల‌కు శుభ‌వార్తే ఇది.. రేపు మంచిర్యాల‌లో జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా ఉపాధి అధికారి రవికృష్ణ ప్ర‌క‌టించారు. అర్హ‌త క‌లిగిన‌వారు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థులకు ఉండాల్సిన అర్హ‌తలు, వేత‌న వివ‌రాలు, ఇంట‌ర్వ్యూలు వంటి వివ‌రాలు ఇలా..

500 Vacancies Open: ఎన్‌ఐఏసీఎల్, ముంబైలో 500 అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

విద్యార్హ‌త‌లు..

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఆవరణలోని ఉపాధి కల్పన కార్యాలయంలో రేపు ఉద‌యం 10:30 గంట‌ల‌కు మినీ జాబ్ మేళా ఉంటుంది. ఫార్మాసిస్ట్​కు పీసీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్​తో కూడిన డి/బి ఫార్మసీ అర్హత ఉండాలన్నారు. మిగతా పోస్టులకు టెన్త్/ఇంటర్/ఏదేని డిగ్రీతోపాటు 18 నుండి30 సంవత్సల వయస్సు కలిగి ఉండాలన్నారు.

Skill Hub : నిరుద్యోగుల‌కు స్కిల్ హ‌బ్ ఉపాధి.. ఈ కోర్సుల్లోనే శిక్ష‌ణ‌..

పోస్టుల వివ‌రాలు..

మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లోని  మెడ్ ప్లస్ సంస్థలో పనిచేసేందుకు 40 ఫార్మాసిస్ట్, 50 కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, 100 జూనియర్ అసిస్టెంట్, 30 ఆడిట్ అసిస్టెంట్ వంటి వివిధ‌ పోస్టుల్లో భ‌ర్తీకి ఈ జాబ్​మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇత‌ర వివ‌రాల‌కు 9392310323, 9110368501 ల‌ను సంప్ర‌దించాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags