Job Mela: రేపు జాబ్‌మేళా..నెలకు రూ. 18వేలకు పైగా

నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా ఎంప్లాయిమెంట్‌ కార్యాలయ ఆధ్వర్యంలో ఎస్‌కేసీపీటీ వింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 24న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి రాఘవేందర్‌ తెలియజేశారు.

150 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆసక్తి ఉన్న 10, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ ఆపై చదివిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మేళా స్థానిక నేషనల్‌ హైస్కూల్‌లో నిర్వహిస్తామని చెప్పారు.

Ap Govt Job Notification ఏపీలో 997 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. వేతనం నెలకు రూ. 70వేలు

ఎంపికైన వారికి రూ.12,500 నుంచి రూ.18,000 వరకు జీతం ఇవ్వడంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం, 50 కిలోమీటర్లలోపు రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఎంపికై న వారికి శంషాబాద్‌లోని కేఎల్‌ గ్రూప్‌ అమెజాన్‌ ఏయిర్‌ హౌజ్‌లో నేరుగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మరింత సమాచారం మేరకు కార్యాలయంలోని 9701200819 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

#Tags