Job Mela: రేపు జాబ్‌మేళా.. ఈ సర్టిఫికేట్స్‌తో హాజరు అయితే..

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలోని నిరుద్యోగ యువకులకు(పురుషులు) యంయస్‌ఎన్‌ లేబరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో టెక్నికల్‌ ట్రైనీగా హైదరాబాద్‌లో పని చేయుటకు ఈనెల 26(బుధవారం)ఉద్యోగమేల నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి రాములు తెలిపారు.

ఇంటర్‌ విద్యార్థులకు ఉద్యోగంతోపాటు ఉచిత డిగ్రీ సదుపాయం కల్పింస్తామని పేర్కొన్నారు. మొత్తం 100 ఖాళీగా ఉన్నాయని, 18 ఏళ్ల నుంచి 20 ఏళ్లలోపువారు అర్హులని తెలిపారు.

Ambulance Driver Posts : పశువర్ధక శాఖ అంబులెన్స్‌లో డ్రైవింగ్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

ఆధార్‌ కార్డు, టెన్త్‌, ఇంటర్‌ మెమోలు, పాస్పోర్ట్‌ సైజ్‌ ఫొటోతో బుధవారం ఉదయం 10 నుంచి 2 గంటల మధ్య ఎన్టీఆర్‌ మినీ స్టేడియంకు రావాలని సూచించారు. వివరాలకు 7794033306, 9441535253 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.

#Tags