Free Training or Women: నిరుద్యోగ మహిళలకు ఈ కోర్సుల్లో ఉచిత శిక్షణ... ఇలా దరఖాస్తు చేసుకోండి

నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ.

మొయినాబాద్‌: జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(ఆర్‌సెటీ) డైరెక్టర్‌ కె.రమేశ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే ‌.. ప్రిపరేషన్‌ కింగ్‌

చిలుకూరు మహిళా ప్రాంగణంలోని ఆర్‌సెటీ కేంద్రంలో టైలరింగ్‌, మగ్గం వర్క్స్‌, బ్యూటీపార్లర్‌ కోర్సుల్లో నెల రోజుల పాటు ట్రైనింగ్‌ ఇస్తామని పేర్కొన్నారు. 19 నుంచి 45 ఏళ్ల వయసుండి, పదో తరగతి చదివిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

TS Gurukulam Jobs Exam Date and Timing Changes 2023 : తెలంగాణ గురుకులం ప‌రీక్ష‌ల్లో మార్పులు.. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు..

దరఖాస్తు ఫారానికి టెన్త్‌ మెమో, రేషన్‌, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ జిరాక్స్‌ కాపీలు, 4 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు జతచేయాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పించడంతో పాటు యూనిఫాం, టూల్‌ కిట్స్‌ ఇస్తామని చెప్పారు. వివరాలకు 8639079122, 7981951167, 9000778300 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

#Tags