JNV 6th Class Admission Exam 2024 Question Paper With Key : నవోదయ ప్రవేశ పరీక్ష-2024 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2024–25 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాల‌కు ప్రవేశ పరీక్ష జ‌న‌వ‌రి 20వ తేదీన‌ నిర్వహించిన విష‌యం తెల్సిందే.

ఈ ప్రవేశ పరీక్ష ఉదయం 11.30 నుంచి 1.30 వరకు నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) మీకోసం ప్ర‌త్యేకం అందిస్తుంది. ఈ ప‌రీక్ష 'కీ' ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులుతో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్రిపేర్ చేయించింది.

☛  ‘నవోదయం’ ప్రవేశాలు.. ఎవరు అర్హులు..? రిజర్వేషన్‌ విధానం ఇలా.. 

ప‌రీక్ష పేప‌ర్ ఇలా..
నవోదయ 6వ తరగతిలో ప్రవేశ పరీక్షలో వంద మార్కులకు 80 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఇచ్చారు. మూడు విభాగాల్లో ఈ ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కు ఉంటుంది. రీజనింగ్‌ మేథాశక్తిలో 50 మార్కులకు 40 ప్రశ్నలు, గణితంలో 25 మార్కులకు 20 ప్రశ్నలు, తెలుగు లేదా ఇంగ్లిష్‌లో ఐదు ప్యాసేజ్‌లు ఇచ్చారు. ఒక్కో ప్యాసేజ్‌కు నాలుగు ప్రశ్నల చొప్పున ఉంటాయి. వీటికి 25 మార్కులు ఉంటాయి. మేధాశక్తి విభాగంలో 50 మార్కులు ఉంటాయి.

నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్రిపేర్ చేసిన‌ కీ కేవ‌లం ఒక అవ‌గాహన కోస‌మే. అంతిమంగా జవహర్‌ నవోదయ విద్యాలయం స‌మితి అధికారికంగా విడుద‌ల చేసే కీ ని ప్ర‌మాణికంగా తీసుకోవ‌లెను.

నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష 2024 కు సంబంధించిన కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే..

 

#Tags