JEE Mains 2025 Correction Window: జేఈఈ మెయిన్స్‌ దరఖాస్తుల్లో సవరణలకు రేపే చివరి రోజు

జేఈఈ మెయిన్స్‌ అభ్యర్థులకు అలర్ట్‌. మెయిన్స్‌-2025కు దరఖాస్తు చేసుకొని, తమ అప్లికేషన్‌లో ఏమైనా సవరణలు చేయాలనుకునే అభ్యర్థులకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA)అవకాశం కల్పించింది. అభ్యర్థులు నవంబర్‌ 26, 27 తేదీల్లో తమ దరఖాస్తుల్లో తప్పులుంటే కరెక‌్షన్‌ చేసుకోవచ్చు. రేపు(బుధవారం)రాత్రి 11.50గంటలతో గడువు ముగియనుంది.jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఏమైనా తప్పులుంటే ఎడిట్‌ చేసుకోవచ్చు. 
JEE Mains 2025 Correction Window

అయితే అభ్యర్థులు తమ మొబైల్ నంబర్, ఈమెయిల్, శాశ్వత / ప్రస్తుత చిరునామా, అత్యవసర సంప్రదింపు వివరాలు, ఫోటోలను మార్చడానికి మాత్రం అనుమతి లేదు.

Intermediate Exam Fees: ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే..

కేవలం తమ పేరు, తల్లి పేరు/తండ్రి పేరు, మార్కుల వివరాలు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవచ్చు. కాగా దేశ వ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే.

Free Civils Coaching: సివిల్‌ సర్వీస్‌ ఉచిత శిక్షణకు ప్రవేశపరీక్ష

జేఈఈ మెయిన్ సెషన్-1 2025 జనవరి 22 నుంచి జనవరి 31 వరకు జరగనుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags