JEE Main Topper Aryan Prakash Sucess Journey: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో 100% స్కోరు, రోజుకు ఎన్ని గంటలు చదివేవాడినంటే..

దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 56 మంది 100 పర్సంటైల్‌ స్కోరు  సాధించగా, వీరిలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర నుంచి ఉన్నారు. ఇక జేఈఈ మెయిన్స్‌లో 100 శాతం మార్కులతో టాపర్స్‌లో ఒకరిగా నిలిచారు మహారాష్ట్రకు చెందిన ఆర్యన్‌ ప్రకాశ్‌. ఇతని సక్సెస్‌ జర్నీ మీ కోసం..

ఆర్యన్‌ ప్రకాశ్‌కు జేఈఈ మెయిన్స్‌లో మొత్తం 300 మార్కులకు 300 మార్కులతొ 100 పర్సంటైల్‌ స్కోరును సాధించారు. రెండేళ్లుగా జేఈఈ మెయిన్స్‌ కోసం కష్టపడుతున్నానని, చివరికి తన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఆర్యన్‌ తల్లి నైనా ప్రకాశ్‌, తండ్రి రంజన్‌ ప్రకాశ్‌. ఈయన గతంలో ఇన్‌కం ట్యాక్స్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. తన సక్సెస్‌లో తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని తెలిపాడు.

ఐఐటీ–బాంబేలో చదవాలనుంది: ఆర్యన్‌ ప్రకాశ్‌
ఈ సక్సెస్‌ ఒక్క రోజులో వచ్చింది కాదు.. దాదాపు రెండేళ్లుగా కష్టపడుతున్నా. రోజుకు 8-9 గంటలు చదివేవాడిని. పరీక్ష రాసే రోజు చాలా రిలాక్స్‌డ్‌గానే అనిపించింది. సెషన్‌-1,2కు పెద్దగా తేడా ఏం అనిపించలేదు. అయితే రెండు-మూడు ప్రశ్నల దగ్గర మాత్రం కన్‌ఫ్యూజ్‌ అయ్యాను.

అక్కడే కాస్త సమయం ఎక్కువ తీసుకున్నా అనిపించింది. కానీ మొత్తానికి ప్రశాంతంగా పరీక్ష పూర్తి చేశాను. ఫలితాల్లో 100 పర్సంటైల్‌ అని తెలియగానే సంతోషించాను. ప్రస్తుతం తన దృష్టి JEE అడ్వాన్స్‌డ్‌పైనే ఉంది. నాకు ఐఐటీ–బాంబేలో ఇంజనీరింగ్‌ చదవాలనుకుంటున్నా.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంతమంది అర్హత సాధించారంటే..
కాగా జేఈఈ మెయిన్‌ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ జనవరి, ఏప్రిల్‌లో రెండు సెషన్లుగా నిర్వహించింది. ఈ రెండు సెషన్లకు కలిపి 9,24,636 మంది దరఖాస్తు చేస్తే, 8,22,899 మంది పరీక్ష రాశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది అర్హత సాధించారు. జేఈఈ మెయిన్‌లో అత్యుత్తమ పర్సంటైల్‌ సాధించిన 2,50,284 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్టు ఎన్టీఏ ప్రకటించింది. 

#Tags