JEE Advanced Registration Dates Revised: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రిజిస్ట్రేషన్‌ షెడ్యూల్‌లో మార్పులు ఇవే..

ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రిజిస్ట్రేషన్‌ షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)మద్రాస్‌ ప్రకటించింది. తొలుత జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కోసం విద్యార్థులు ఏప్రిల్‌ 21 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఇప్పుడు ఏప్రిల్‌ 27 నుంచి మే 7 సాయత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేలా షెడ్యూల్‌లో మార్పులు చేశారు.

జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పరీక్ష తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఐఐటీ మద్రాస్‌ పేర్కొంది.

జేఈఈ మెయిన్స్‌ 2024లో 2,50,000 లోపు ర్యాంకు సాధించిన అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్ 2024కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ద్వారా దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024-ముఖ్యమైన తేదీలు


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్‌ 27 నుంచి ప్రారంభం అవుతుంది
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: మే 7 సాయంత్ర​ం 5 గంటల వరకు
పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేది: మే 10, 2024

అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌: మే 17 నుంచి మే 26 వరకు
పరీక్ష తేది: మే 26న

పరీక్ష సమయం: పేపర్ 1 ఉదయం 9 నుండి 12 గంటల వరకు,
పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు 
 

#Tags