Success Story : 600కు 600 మార్కులు.. ఓ బాలిక రికార్డ్ సృష్టించిందిలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్లస్‌ టూ ఫలితాల్లో ఓ బాలిక రికార్డ్ సృష్టించింది. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని అన్నామలైయర్ మిల్స్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌కు చెందిన ఎస్ నందిని 100 శాతం మార్కులు సాధించింది.
Nandhini

రాష్ట్ర బోర్డు పరీక్షల్లో 600 మార్కులకు 600 సాధించి రికార్డ్ సృష్టించింది. మార్చిలో జరిగిన ప్లస్‌ టూ పరీక్షల ఫ‌లితాల‌ను మే 8వ తేదీ(సోమవారం) ప్రకటించారు. ఈ ఫలితాల్లో  ఈ బాలిక తమిళం, ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ, కంప్యూటర్ అప్లికేషన్ మొత్తం ఆరు సబ్జెక్టులలో 100/100 స్కోర్ చేసింది.

చ‌ద‌వండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

ఈయ‌న వల్లే ఈ ఘనతను..

మా నాన్నగారు కష్టపడి చదవించడం వల్లే తాను ఈ ఘనత సాధించానని నందిని చెప్పింది. ఈమె తండ్రి ఎస్ శరవణ కుమార్ కార్పెంటర్ గా పనిచేస్తున్నారు. తల్లి ఎస్ బానుప్రియ, గృహిణి. సోదరుడు ఎస్ ప్రవీణ్ కుమార్ 6వ తరగతి చదువుతున్నాడు. వీరు దిండిగల్ పట్టణంలోని నాగల్ నగర్‌లో ఉంటున్నారు. తాను సొంతంగా టైమ్ టేబుల్ వేసుకుని ప్రణాళికబద్దంగా చదవడం వల్లే ఇది సాధ్యమైందని ఆ విద్యార్థిని చెప్పింది. ఈ బాలిక ఘనత పట్ల ఆమె ఉపాధ్యాయులు కూడా ఆనందం వ్యక్తం చేశారు.

☛AP 10th Class Results 2023 : 12 ఏళ్లకే టెన్త్‌ పాసైన విద్యార్థి.. ఈ అమ్మాయికి వచ్చిన మార్కులు ఎన్నంటే..?

Inspiration: శ‌భాష్ అమ్మా... డిజిటల్‌ విధానంలో పరీక్ష పాసై చరిత్ర సృష్టించిన దివ్యాంగ అమ్మాయిలు

మా కష్టాలను చూసి..
మేము ప‌డుతున్న‌ కష్టాలను చూసి మా బిడ్డ పెరిగిందని.. ఆ విధంగానే చదువులో రాణించిందని నందిని తండ్రి తెలిపారు. నందిని పరీక్షల్లో మంచి స్కోరు సాధిస్తుందని మాకు తెలుసు. ఆమెకు ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ అండగా నిలిచేవారని పాఠశాలు ప్రధానోపాధ్యాయురాలు అఖిల అన్నారు. తాను సొంతంగా టైమ్ టేబుల్ వేసుకుని ప్రణాళికబద్దంగా చదివేదానిని అని నందిని తెలిపింది.

☛ Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్‌ అవకాశాలు ఇవే..

నందినిని చూసి గర్వపడుతున్నా.. మీకు ఏ సాయం కావాలన్నా అడ‌గండి.. : తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 

తమిళనాడు ప్లస్‌ టూ ఫలితాల్లో 600లకు 600 మార్కులు సాధించి భళా అనిపించిన విద్యార్థిని ఎస్‌.నందినిని ముఖ్యమంత్రి స్టాలిన్ అభినందించారు. ఈ క్రమంలో ఆమెకు ఫోన్‌ చేసి అభినందించిన సీఎం స్టాలిన్‌ ఆహ్వానం మేరకు మంగళవారం ఉదయం నందిని తన కుటుంబ సభ్యులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, విద్యాశాఖ అధికారులతో కలిసి సీఎం స్టాలిన్‌ వద్దకు వెళ్లారు.

ఈ సందర్భంగా బాలికను అభినందించిన సీఎం.. బహుమతులు ఇచ్చారు.  హయ్యర్‌ సెకెండరీ బోర్డు పరీక్షల్లో తన సత్తాచాటిన విద్యార్థిని ఉన్నత చదువులకు అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్లస్‌ టూలో ఆరు సబ్జెక్టులకు నూరు శాతం మార్కులతో అదరగొట్టిన నందిని తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారిని కలిసి మాట్లాడిన స్టాలిన్‌.. నందినిని చూసి గర్వపడుతున్నట్టు పేర్కొన్నారు. తదుపరి చదువులకు గాను ఏ సాయం కావాలన్నా తనను అడగాలని సీఎం సూచించారు.

అన్ని స‌బ్జెక్ట్‌ల్లో..

దిండిగల్లు జిల్లాకు చెందిన నందిని తండ్రి కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. అన్నామలైయార్‌ మిల్స్‌ బాలికల హయ్యర్‌ సెకెండరీ స్కూల్‌లో చదివిన విద్యార్థిని తమిళ్‌, ఇంగ్లీష్‌, ఎకనమిక్స్‌, కామర్స్‌, అకౌంటెన్సీ, కంప్యూటర్‌ అప్లికేషన్‌ సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు సాధించి సంచలనం సృష్టించింది.

ఎవరూ దొంగతనం చేయలేని ఆస్తి ఇదే..

చదువు ఎవరూ దొంగతనం చేయలేని ఆస్తి అని చాలా కార్యక్రమాల్లో తాను చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. విద్యనే ఆస్తిలా భావించి చదివానని ఆ బాలిక ఓ ఇంటర్వ్యూలో చెప్పడం చూసి గర్వపడ్డానన్నారు. తాను స్వయంగా ఫోన్‌ చేసి అభినందించానని.. ప్రభుత్వం తరఫున ఆమె ఉన్నత విద్యకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. టాపర్‌గా నిలిచిన నందినిని అభినందించిన వీడియోను  సీఎం తన ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నందినిలాంటి వారు తమిళనాడుకు గౌరవ చిహ్నాలని అభివర్ణించారు. 

నా ల‌క్ష్యం ఇదే..

సీఎం స్టాలిన్‌ను కలవడం, ఆయన నుంచి గిఫ్ట్‌లు అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు నందిని పేర్కొన్నారు. తాను సాధించిన విజయం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకే అంకితమన్నారు. నా ల‌క్ష్యం ఆడిటర్‌ కావాలనుకుంటున్నట్టు తెలిపారు.

#Tags