Amma Vodi Scheme: ఇంటర్‌ విద్యార్థుల ఖాతాల్లోకే ‘అమ్మఒడి’

తిరుపతి అర్బన్‌ : ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఎస్పీ విద్యార్థుల ఖాతాల్లో అమ్మఒడి నగదు జమ చేయనున్నట్లు ఎస్సీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి చెన్నయ్య వెల్లడించారు. మంగళవారం లక్ష్మీనగర్‌ కాలనీ, చైతన్యపురం, దామినీడు సచివాలయాలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు తమ బ్యాంక్‌ ఖాతాలను ఓపెన్‌ చేయాలని సూచించారు. ఎస్సీ, బీసీ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు జాగ్రత్తగా విద్యార్థుల వివరాలను నమోదు చేయాలన్నారు. జాబితాలో ఎలాంటి తప్పులకు తావు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. సచివాలయ సిబ్బంది నమోదు చేస్తున్న వివరాల్లో చిన్నపాటి తప్పు దొర్లినా సంక్షేమ పథకాలు పొందేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. ఆన్‌లైన్‌లో చేసే సమయంలో విద్యార్థుల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని ఆయన సూచించారు.

Change in Science Syllabus: 2 సైన్స్‌ సిలబస్‌లో మార్పు

#Tags