MBA Admissions In NIT Warangal: నిట్‌ వరంగల్‌లో ఎంబీఏ ప్రవేశాలు,అప్లికేషన్‌కు చివరి తేదీ ఎప్పుడంటే..

వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(NIT), 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యరథులు అప్లై చేసుకోవచ్చు. 

అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు వ్యాలిడ్‌ క్యాట్‌/మ్యాట్‌ స్కోర్‌ సాధించి ఉండాలి.అదే ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 55% మార్కులతో ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ క్యాట్‌/మ్యాట్‌ స్కోర్‌ ఉండాలి. 

ఎంపిక విధానం: క్యాట్‌/మ్యాట్‌ స్కోర్, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌ ఫీజు: రూ. 1600/-, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 800/. 
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 16, 2024
షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: ఏప్రిల్‌ 30, 2024
గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ తేది: మే 20-22 వరకు
తుది ఫలితాల వెల్లడి తేది: మే 31, 2024
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: https://www.nitw.ac.in/ను సంప్రదించండి. 

#Tags