Telangana History for Competitive Exams: బహమనీ రాజ్యస్థాపనకు సహాయం చేసిందెవరు?
పద్మనాయక వంశానికి మూలపురుషుడైన భేతాళనాయకుడికి నలుగురు కుమారులు. వారిలో దామానాయుడు, ప్రసాదిత్యనాయుడు తండ్రి రాజ్యాన్ని పాలిస్తూ, రుద్రమదేవి సేనానులుగా కాకతీయ రాజ్యంలో ప్రముఖ స్థానం పొందారు. రుద్రమదేవి అధికారంలోకి రాగానే బంధువర్గం తిరుగుబాటు చేసింది.
మరోవైపు యాదవరాజులు ఓరుగల్లుపై దండెత్తారు. ప్రసాదిత్యానాయుడు ఈ చిక్కులను తొలగించి ఆమె అధికారాన్ని నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. కాకతీయ రాజ్యస్థాపనాచార్య, రాయపితామహాంక అనే ఇతడి బిరుదులు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. కాకతీయ సామ్రాజ్య పరిరక్షణలో భాగంగా నాయంకర వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత ఇతడిదేనని వెలుగోటి వంశావళిని బట్టి తెలుస్తోంది.
Telangana History for Competitive Exams: కాకతీయుల కాలం సాహిత్యానికి స్వర్ణయుగం
కాకతీయానంతర యుగం
కాకతీయుల అనంతరం ఓరుగల్లు ఢిల్లీ సామ్రాజ్యంలో భాగమైంది. అదే సమయంలో మధుర కూడా ఢిల్లీ సుల్తానుల వశమైంది. ఆంధ్రనగరిగా పేరొందిన ఓరుగల్లు సుల్తాన్‌పూర్‌గా మారింది. జలాలుద్దీన్ హసన్‌షా మధురకు రాజుకాగా, ఓరుగల్లు ప్రాంతం దేవగిరి వజీరయిన మాలిక్ బుర్హన్‌ఉద్దీన్ పాలనలోకి వచ్చింది. ఇతడికి సహాయంగా ఓరుగల్లులో మాలిక్ మక్బూల్ వజీర్ అయ్యాడు. ప్రతాపరుద్రుడి సేనానిగా పనిచేసిన నాగయగన్నయ మతం మార్చుకొని మాలిక్ మక్బూల్ అయ్యాడు. ఢిల్లీ సుల్తాన్ మహ్మద్‌బిన్ తుగ్లక్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఇందులో భాగంగా ఆంధ్రదేశంలోనూ స్వతంత్ర రాజ్య స్థాపన కోసం తిరుగుబాట్లు జరిగాయి.
ప్రతాపరుద్రుడి మరో సేనాని రేచర్ల సింగమనాయకుడు స్వతంత్రించి దక్షిణ తెలంగాణలో పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు. ప్రోలయ ఉత్తర తెలంగాణ,ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ముస్లింలను పారదోలి రేకపల్లి రాజధానిగా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. దక్షిణ తీరాంధ్రలో 1325 నాటికే ప్రోలయ వేమారెడ్డి స్వతంత్రించాడు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అరవీటి వంశానికి చెందిన సోమదేవరాజు స్వతంత్రించాడు. అనంతరం కంపిలిలో హరిహరరాయలు, బుక్కరాయలు స్వతంత్రరాజ్యాన్ని స్థాపించారు. నుస్రత్‌ఖాన్ బీదర్ çసమీపంలో స్వతంత్ర రాజ్యస్థాపనకు యత్నించి విఫలమయ్యాడు.ఈ విధంగా కాకతీయ సామ్రాజ్య శి«థిలాల నుంచి కంపిలి(విజయనగర),రెడ్డి,వెలమ, నాయక అనే నాలుగు స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి. ఈ రాజ్యాల స్థాపనతో ఆంధ్ర దేశంలో ముస్లింల అధికారం అంతమైంది. వీటిలో తెలంగాణతో సంబంధమున్న రాజ్యాల గురించి తెలుసుకుందాం.
Telangana History for Groups: కలకాలం నిలిచి ఉండే కాకతీయుల ప్రాభవం
ముసునూరి నాయకులు
ముసునూరు గ్రామం కృష్ణాజిల్లా ఉయ్యూరు తాలూకాలో ఉంది. నెల్లూరు జిల్లాలోనూ ఈ పేరుతో ఓ గ్రామం ఉంది. కానీ కృష్ణా జిల్లాలోని ముసునూరులో కోటశిథిలాలు ఉండటాన్ని బట్టి వీరి జన్మస్థలం ఇదే కావచ్చు. కమ్మ సామాజిక వర్గంలో ముసునూరి వారు ఉండటాన్ని బట్టి ముసునూరు నాయకులు కమ్మ కులస్థులు లేదా వారి పూర్వీకులై ఉంటారు. కాకతీయుల పతనానంతరం ముస్లింల వశమైన ఆంధ్రదేశంలో అసంతృప్తి చెలరేగింది. దీన్ని అవకాశంగా తీసుకొని ఈ వంశానికి చెందిన ప్రోలయ నాయకుడు భద్రాచలం ప్రాంతంలోని రేకపల్లి కేంద్రంగా ముస్లింలతో పోరాడాడు. ప్రోలయ నాయకుడికి అతడి పినతండ్రి కుమారుడైన కాపయనాయకుడు, వేంగి పాలకుడైన వేంగభూపాలుడు, రుద్రదేవుడు, అన్నమంత్రి సహకరించారు. ప్రోలయ ముస్లింలను పారదోలి రేకపల్లి రాజధానిగా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు.
ప్రోలయకు సంతానం లేనందువల్ల అతడి మరణం తర్వాత కాపయనాయకుడు రాజయ్యాడు. సింగమనీడు, వేమారెడ్డిల సహకారంతో ముస్లింలపై పోరాటం కొనసాగించి 1336లో ఓరుగల్లు కోటను ఆక్రమించాడు. మాలిక్ మక్బూల్ పారిపోయాడు. ఓరుగల్లు రాజధానిగా ఉత్తర తెలంగాణను, కృష్ణానది నుంచి గోదావరి వరకు ఉన్న తీరాం్ర«ధను పాలించాడు. విస్తరణ కాంక్షతో రేచర్ల సింగమనేని రాజ్య భాగాలైన పిల్లలమర్రి, ఆమనగల్లు, వాడపల్లి ప్రాంతాలను ఆక్రమించి వాటి పాలకుడిగా ఎరబోతు లెంకను నియమించాడు. తీరాంధ్రను పాలించేందుకు ప్రతినిధులను నియమించాడు. కోడుకొండ్ల ప్రాంతంలో తన ప్రతినిధిగా కూన నాయకుడిని నియమించాడు. సబ్బినాడు (కరీంనగర్)కు ముప్పభూపాలుడిని రాజప్రతినిధిగా నియమించాడు. ఇతడు మడికి సింగనకు ఆశ్రయం కల్పించాడు. కాపయ నాయకుడు తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకుంటున్న సమయంలో హసన్ గంగూ(జాఫర్ ఖాన్) మహ్మద్‌బిన్ తుగ్లక్‌పై తిరుగుబాటు చేశాడు. అలాఉద్దీన్ బహమన్ షా అనే బిరుదుతో 1341లో గుల్బర్గా రాజధానిగా బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. ఈ తిరుగుబాటు సమయంలో కాపయ నాయకుడు హసన్ గంగూకు సహాయం చేశాడు. కానీ హసన్ గంగూ కొంత కాలం తర్వాత ఓరుగల్లు మీద దాడి చేశాడు. కాపయ కౌలాస్ (నిజామాబాద్) దుర్గాన్ని వదులుకున్నాడు. హసన్ గంగూ 1356–57లో మరోసారి దండెత్తాడు. కాపయ ఈసారి భువనగిరి దుర్గాన్ని కోల్పోయాడు. నాటి నుంచి కొంత కాలం బహమనీ సుల్తాన్లకు భువనగిరి తూర్పు సరిహద్దుగా మారింది. విజయనగర బుక్కరాయల సాయంతో కాపయ నాయకుడు బహమనీ సుల్తాన్‌ను అరికట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం సఫలం కాకపోగా కుమారుడైన వినాయక దేవుణ్ణి కోల్పోయాడు. కాపయ నాయకుడి చర్యకు ఆగ్రహించిన బహమనీ సుల్తాన్ హుమాయున్ గోల్కొండ పైకి తన సేనానిని, ఓరుగల్లుపై సఫదర్‌ఖాన్‌ను దండయాత్రకు పంపాడు. కాపయ ఈసారి గోల్కొండ దుర్గం సహా పరిసర ప్రాంతాల్ని కొల్పోయాడు. 1364–65లో బహమనీ సుల్తాన్‌తో సంధి చేసుకొని పై ప్రాంతంతో పాటు 300 ఏనుగులను, 2000 గుర్రాలను, 3 లక్షల రూపాయలను యుద్ధ నష్టపరిహారంగా చెల్లించాడు.
కాయప నాయకుడి వరుస పరాజయాలను అదనుగా తీసుకొని తీరాంధ్ర పాలకులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఉత్తర తీరాంధ్ర రెడ్ల ఆధీనంలోకి వెళ్లింది. తీరాంధ్ర చేజారే సమయంలోనే దక్షిణ తెలంగాణలో ఆమనగల్లు, పిల్లలమర్రి ప్రాంతాలను పాలిస్తున్న రేచర్ల సింగమనాయకుడు విజృంభించి కృష్ణా నదివరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు. తుంగభద్ర, అంతర్వేది ప్రాంతాలను కూడా అతడు ఆక్రమించాడు. దీనికి ఆగ్రహించిన కాపయ నాయకుడు సింగమనాయకుడిని హతమార్చాడు.
సింగమనాయకుని తర్వాత రాజైన అనపోతానాయకుడు తన తండ్రి మరణానికి కారణమైన కాపయ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఓరుగల్లు మీద దండయాత్ర చేశాడు. 1366 (1367–68 అని మల్లంపల్లి సోమశేఖర శర్మ అభిప్రాయం)లో కాపయను సంహరించి ఓరుగల్లు, భువనగిరి తదితర దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు. ఇంతటితో ముసూనూరి వంశం అంతరించింది. ఈ చరిత్రను బట్టి 30ఏళ్లపాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ముసునూరి వంశ పాలనలో ఉన్నాయని తెలుస్తోంది.
Telangana History for Groups: కాకతీయుల కాలంలో గ్రామరక్షణ బాధ్యత ఎవరిది?
పద్మనాయకులు (1326–1482)
పద్మనాయక వంశానికి మూలం రేచర్ల రెడ్లు. రేచర్ల నామిరెడ్డి మేనల్లుడైన చెవ్విరెడ్డి (భేతాళరెడ్డి /భేతాళనాయకుడు) పద్మనాయక వంశానికి మూల పురుషుడు. బేతిరెడ్డి, చెవ్విరెడ్డి మొదలైన పేర్లు వీరిని రెడ్డి తెగకు చెందినవారని సూచిస్తుండగా, సేనా నాయకత్వాన్ని సూచించే నాయుడు బిరుదును కూడా పద్మనాయకులు ధరించడాన్ని బట్టి వీరు రెడ్లు కాకపోవచ్చని భావించారు. కానీ వీరికి రెడ్లతో దగ్గర సంబంధం ఉందని చరిత్రకారుల అభిప్రాయం. సురవరం ప్రతాపరెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చెవ్విరెడ్డి వంశీయులే వైష్ణవమతాన్ని స్వీకరించి సంస్కరణ మార్గంలో పయనించి వెలమలై రేచర్ల పద్మనాయకులయ్యారు. పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు, వెంకటగిరి సంస్థానాధిపతులు ఈ తెగకు చెందిన వారే. కాకతీయుల సామంత మాండలికుల్లో రేచర్ల పద్మనాయకులు చివరి వరకూ అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నారు. వీరు నల్లగొండ జిల్లాలోని పిల్లలమర్రి, నాగులపాడు ప్రాంతాలను మహాసామంతులుగా పాలించారు.
కాకతీయ సామ్రాజ్య పతనానంతరం రేచర్ల పద్మనాయకులు ఢిల్లీ సుల్తాన్లను, బహమనీ సుల్తాన్లను అరికట్టి తెలంగాణను పాలించారు. వీరు తెలంగాణేతర ప్రాంతాలను జయించినా.. కొంత కాలం తర్వాత వాటిని కోల్పోయేవారు. అదే విధంగా ఇతరులు తెలంగాణ ప్రాంతాలను ఆక్రమించినా వీరు తిరిగి పొందగలిగేవారు. మిర్యాలగూడ తాలూకాలోని ఆమనగల్లు వీరి జన్మస్థలం. వీరికి ముందు ఆమనగల్లు రాజధానిగా రేచర్ల రెడ్లు, కందూరి చోడులు పరిపాలించారు. పద్మనాయక వంశానికి మూలపురుషుడైన భేతాళనాయకుడిని గణపతిదేవుడు ఆమనగంటి పాలకుడిగా
నియమించాడు.
History Notes for Groups: శాతవాహనులు–సంస్కృతి
మాదిరి ప్రశ్నలు
1. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ ‘కంచుగంట’ తయారీ కేంద్రాలు?
1) పానగల్లు, భువనగిరి
2) పానగల్లు, చండూరు
3) చండూరు, నిర్మల్
4) చండూరు, భువనగిరి
- View Answer
- సమాధానం: 2
2. కాకతీయల కాలంలో కత్తుల తయారీకి పేరొందిన ప్రాంతం?
1) నిర్మల్
2) చండూరు
3) పానగల్లు
4) బోధన్
- View Answer
- సమాధానం: 1
3. తెలుగులో తొలి స్వతంత్ర కవిగా, ఆదికవిగా పేరొందింది ఎవరు?
1) నరహరి
2) పాల్కురికి సోమనాథుడు
3) జీనవల్లభుడు
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: 2
4. దేశీయతకు (భాషలో,ఛందస్సులో, వస్తువులో) స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన కవి?
1) వేములవాడ భీమకవి
2) పాల్కురికి సోమనాథుడు
3) నన్నయ
4) ఎర్రన
- View Answer
- సమాధానం: 2
5. కాకతీయులు ఎవరి కాలం నుంచి శైవమతాన్ని అవలంబించారని చరిత్రకారుల అభిప్రాయం?
1) మొదటి ప్రోలరాజు
2) రెండో ప్రోలరాజు
3) రెండో బేతరాజు
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: 3
6. కాకతీయుల కాలంలో ‘కాలముఖశైవ’ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది?
1) జోగిపేట
2) అలంపురం
3) హనుమకొండ
4) ఇంద్రపురి
- View Answer
- సమాధానం: 2
7. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ వైష్ణవ కేంద్రం?
1) జోగిపేట
2) ఇంద్రపురి
3) ధర్మపురి
4) అలంపురం
- View Answer
- సమాధానం: 3
8. కిందివాటిలో వైష్ణవ మతానికి సంబంధించిన రచన?
1) పండితారాధ్య చరిత్ర
2) బసవ పురాణం
3) జినేంద్రకల్యాణాభ్యుదయం
4) రంగనాథ రామాయణం
- View Answer
- సమాధానం: 4
9. తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించిన కాకతీయ రాజెవరు?
1) మొదటి ప్రోలరాజు
2) రెండో ప్రోలరాజు
3) మొదటి బేతరాజు
4) రెండో బేతరాజు
- View Answer
- సమాధానం: 4
10. నీతిసారం గ్రంథ రచయిత?
1) జాయపసేనాని
2) రుద్రదేవుడు
3) ప్రతాపరుద్రుడు
4) నరహరి కవి
- View Answer
- సమాధానం: 2
11. మమ్మటుడి ‘కావ్య ప్రకాశాని’కి వ్యాఖ్యానం ఏది?
1) చిత్తానురంజనం
2) స్మృతిదర్పణం
3) తర్కరత్నాకరం
4) నీతిసారం
- View Answer
- సమాధానం: 1
12. కావ్యప్రకాశానికి వ్యాఖ్యానం రాసింది ఎవరు?
1) బ్రహ్మశివకవి
2) మయూరకవి
3) జాయపసేనాని
4) నరహరి
- View Answer
- సమాధానం: 4
13. నరహరి కవి ఏ ప్రాంతానికి చెందినవారు?
1) భువనగిరి
2) కొలనుపాక
3) హనుమకొండ
4) పానగల్లు
- View Answer
- సమాధానం: 1
14. స్మృతిదర్పణం, తర్కరత్నాకరం గ్రంథాలను రాసిందెవరు?
1) జాయపసేనాని
2) నరహరి కవి
3) మయూరకవి
4) నాగదేవకవి
- View Answer
- సమాధానం: 2
15. ‘నృత్తరత్నావళి’ గ్రంథ రచయిత?
1) పాల్కురికి సోమన
2) నరహరి కవి
3) జాయపసేనాని
4) చక్రపాణి రంగనాథుడు
- View Answer
- సమాధానం: 3
16. శివశక్తి దీపిక, గిరిజాధినాయక శతకాలను రచించిందెవరు?
1) జాయపసేనాని
2) పాల్కురికి సోమన
3) చక్రపాణి రంగనాథుడు
4) విశ్వేశ్వర దేశికుడు
- View Answer
- సమాధానం: 3
17. గణపతిదేవుడి దీక్షాగురువు?
1) కృష్ణమాచార్యులు
2) విశ్వేశ్వరదేశికుడు
3) శరభాంకుడు
4) శివదేవయ్య
- View Answer
- సమాధానం: 2
18. ‘శివతత్త్వ రసాయనం’ గ్రంథ రచయిత?
1) శరభాంకుడు
2) శివదేవయ్య
3) విశ్వేశ్వరదేశికుడు
4) కృష్ణమాచార్యులు
- View Answer
- సమాధానం: 3
19. తెలంగాణకు చెందిన తొలి వైష్ణవ కవి?
1) గంగాధర కవి
2) కృష్ణమాచార్యులు
3) శివదేవయ్య
4) శరభాంకుడు
- View Answer
- సమాధానం: 2
20. తెలుగులో తొలి వచనాలైన ‘సింహగిరి వచనాల’ను రచించిందెవరు?
1) కృష్ణమాచార్యులు
2) శివదేవయ్య
3) శరభాంకుడు
4) గంగాధరకవి
- View Answer
- సమాధానం: 1
21. ‘రాజరుద్రీయం’ గ్రంథ రచయిత?
1) శివదేవయ్య
2) గంగాధర కవి
3) కొలని రుద్రదేవుడు
4) శరభాంకుడు
- View Answer
- సమాధానం: 3
22. కృష్ణమాచార్యులు ఏ ప్రాంత నివాసి?
1) ఓరుగల్లు
2) జోగిపేట
3) భువనగిరి
4) సంతవూరు
- View Answer
- సమాధానం: 4
23. మహాభారతాన్ని నాటకరూపంలో రచించిన కవి?
1) శేషాద్రి రమణ కవులు
2) గంగాధర కవి
3) మంచన
4) శివదేవయ్య
- View Answer
- సమాధానం: 2