Physical Chemistry for Groups Exam : అత్యంత స్థిరత్వం ఉన్న సల్ఫర్‌ రూపాంతరం?

ఫాస్ఫరస్, సల్ఫర్, దాని సమ్మేళనాలు;
సాధారణ ఉప్పు, దాని ఉత్పన్నాలు 

    సల్ఫర్‌ ధాతువులు: కాపర్‌ పైరటీస్‌– CuS, ఐరన్‌ పైరటీస్‌  FeS, గెలీనా PbS , సిన్నబార్‌  HgS, జింక్‌ బ్లెండ్‌ ZnS    ➾    భూగర్భ ఉపరితలంలో లభించే ధాతువుల నుంచి సల్ఫర్‌ను సంగ్రహించే పద్ధతి సిసిలీ పద్ధతి. 
    భూమి పొరల నుంచి సల్ఫర్‌ను  సంగ్రహించే పద్ధతి ఫ్రాష్‌ పద్ధతి.
    సిసిలీ పద్ధతిలో ఉపయోగించే కొలిమి
    – కాల్కొరోని
    సల్ఫర్‌ అణువు ఆకృతి     – కిరీటం
    సల్ఫర్‌ పరివర్తన ఉష్ణోగ్రత 96నిఇ
    ఫ్లవర్‌ ఆఫ్‌ సల్ఫర్‌ 444°C  వద్ద ఏర్పడుతుంది.
    CaSను కాగిత పరిశ్రమలో విరంజనకారిగా ఉపయోగిస్తారు.
    గన్‌పౌడర్‌ సంఘటనం: సల్ఫర్‌ + బొగ్గుపొడి + KNO3
    చర్మవ్యాధుల నివారణలో ఉపయోగించేది -- HgS
    SO2 వాయువు గాలి కంటే 2½ రెట్లు బరువైంది.
    ఫౌంటెన్‌ ప్రయోగం వల్ల SO2 నీటిలో కరుగుతుందని, దానికి ఆమ్ల లక్షణం ఉంటుందని నిరూపించవచ్చు.
    SO2 వాయువు విరంజన చర్యకు కారణం 
    – నవజాత హైడ్రోజన్‌ ఏర్పడటం
    స్పర్శాపద్ధతిలో ఉపయోగించే ఉత్ప్రేరకం
          – V2O5
    నీలి కాపర్‌ సల్ఫేట్‌కు H2SO4 ను కలిపి నపుడు రంగును కోల్పోతుంది. ఈ ప్రక్రియను నిర్జలీకరణం అంటారు.
    సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని రసాయనాల రాజు అంటారు.
   సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని డిటర్జెంట్స్, పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. బ్యాటరీలను నిల్వచేయడానికి వాడుతారు.
    సల్ఫ్యూరిక్‌ ఆమ్లం Au, Pt వంటి లోహా లతో చర్య జరపదు.
    అగ్నిపర్వతాల నుంచి వెలువడే వాయువు H2S 
    H2S తయారు చేయడానికి ఉపయోగించే పరికరం     – కిప్పు పరికరం 
    H2S గాలి కంటే బరువైంది. ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది.
    లెడ్‌ ఎసిటేట్‌లో ముంచిన వడ΄ోత కాగితాన్ని H2S  నల్లగా మారుస్తుంది. 
    ఓలియంను నీటితో చర్య జరిపిస్తే H2SO4 ఏర్పడుతుంది.
    H2S క్షయకరణ కారకంగా పనిచేస్తుంది.
   సల్ఫర్‌ రూపాంతరాల్లో అత్యంత స్థిరమైంది     – రాంబిక్‌ సల్ఫర్‌ 
    K2Cr2O4లో ముంచిన వడ΄ోత కాగి తాన్ని SO2 వాయువు ఆకుపచ్చగా మారుస్తుంది. 
    ఫాస్ఫోరైట్‌ ఫార్ములా Ca3(PO4)2
    మెటా ఫాస్ఫారిక్‌ ఆమ్లం ఫార్ములా HPO3
    ఫాస్ఫరస్‌ పరిశ్రమలో పనిచేసే శ్రామికులకు వచ్చే జబ్బు         – ఫాసిజా
    భాస్వరాన్ని గాలిలో ఉంచితే నెమ్మదిగా మెరుస్తుంది. దీన్ని ఫాస్ఫారిజన్స్‌ అంటారు.
    ఎలుకలను చంపడానికి తెల్ల భాస్వరాన్ని ఉపయోగిస్తారు.
    ఫాస్ఫార్‌ బ్రాంజ్‌ మిశ్రమలోహం
                                              – Cu + Sn + P
    అగ్గిపుల్లలోని పదార్థాలు KClO3,Sb2S3, బంక
    అగ్గిపెట్టె పక్కభాగంలోని పదార్థాలు
    – ఎర్రభాస్వరం, Sb2, గాజుముక్కలు.
    ఫాస్ఫారిక్‌ ఆమ్లం ఒక త్రిక్షార ఆమ్లం.
    సూపర్‌ ఫాస్ఫేట్‌ ఆఫ్‌ లైమ్‌ ఒక ఫాస్ఫోటిక్‌ ఎరువు.
    గాఢ ఉప్పు ద్రావణంలోనికి HCl వాయు వును పంపి శుద్ధమైన ఉప్పును ΄÷ందుతారు.
    ఉప్పునీటి ద్రావణాన్ని బ్రైన్‌ ద్రావణం అంటారు.
    సోడియం లోహం మెర్క్యురీతో కలిసి సోడియం అమాల్గంను ఏర్పరుస్తుంది. 
    క్లోరిన్‌.. ఆకుపచ్చ పసుపు రంగు ఉన్న వాయువు.
    తడిపిన పూలు క్లోరిన్‌ సమక్షంలో రంగును కోల్పోవడానికి కారణం నవజాత ఆక్సిజన్‌ ఏర్పడటం.
    బ్లీచింగ్‌ ΄ûడర్‌ ఫార్ములా  CaOCl2
    ఫాస్‌జీన్‌ ఫార్ములా --COCl2
    టియర్‌ గ్యాస్‌ – CCl3NO2; 
    క్లోరోఫామ్‌ –  CHCl3

మాదిరి ప్రశ్నలు
    

1.    కిందివాటిలో సల్ఫర్‌ ధాతువు కానిది?
    ఎ) కాపర్‌ పైరటీస్‌    బి) హెమటైట్‌ 
    సి) గెలీనా               డి) సిన్నబార్‌ 
2.    సల్ఫర్‌ పరివర్తన ఉష్ణోగ్రత?
    ఎ) 106°C    బి) 86°C
    సి) 90°C    డి) 96°C
3.    అత్యంత స్థిరత్వం ఉన్న సల్ఫర్‌ రూపాంతరం?
    ఎ) ప్లాస్టిక్‌ సల్ఫర్‌
    బి) మోనోక్లినిక్‌ సల్ఫర్‌ 
    సి) రాంబిక్‌ సల్ఫర్‌
    డి) ఫ్లవర్‌ ఆఫ్‌ సల్ఫర్‌ 
4.    సిసిలో పద్దతిలో సల్ఫర్‌ ధాతువును ఉంచే కొలిమి పేరు?
    ఎ) బ్లాస్ట్‌ కొలిమి    
    బి) షాఫ్ట్‌కొలిమి
    సి) కాల్కరోని కొలిమి    
    డి) రివర్బరేటరీ 
5.    గన్‌ పౌడర్‌ అంటే?
    ఎ) ఫాస్ఫరస్, చార్‌కోల్, మెగ్నీషియం పౌడర్‌     
    బి) సల్ఫర్, బొగ్గుపొడి, KNO3 మిశ్రమం
    సి) Se, దీపాంగారం
    డి) బొగ్గుపొడి, NCl3 ల మిశ్రమం

6.  
    (స్పర్శాపద్ధతి) ఈ చర్యలో ఉత్ప్రేరకం?
    ఎ) Ni        బి) Mo
    సి) Fe            డి) V2O5
7.    రసాయనాల రాజు అని దేన్ని అంటారు?
    ఎ)  H2SO4
    బి) H2SO3
    సి) H2S2O7    
    డి) H3PO4
8.    నీలి కాపర్‌ సల్ఫేట్‌కు సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని కలిపినపుడు రంగుని కోల్పోతుంది. ఈ ప్రక్రియను ఏమంటారు?
    ఎ) ఆక్సీకరణం    బి) నిర్జలీకరణం
    సి) క్షయకరణం    డి) ఫెర్మెంటేషన్‌
9.    సల్ఫ్యూరిక్‌ ఆమ్లం ఏ లోహాలతో చర్య పొందదు?
    ఎ)Zn, Mg    బి) Cu, Ca
    సి) Au, Pt    డి) Ag, Sn
10.    ఫెర్రస్‌ సల్ఫైడ్‌.. హైడ్రోక్లోరిక్‌ ఆమ్లంతో చర్య పొందినపుడు ఏర్పడే వాయువు?
    ఎ) SO2    బి) SO3
    సి) H2S     డి) NH3
11.    K2Cr2O7 ద్రవంలో ముంచిన వడ΄ోత కాగితాన్ని ఏ వాయువు దగ్గరకు తీసుకెళ్తే లేత ఆకుపచ్చ రంగుని పొందుతుంది?
    ఎ) H2S     బి) SO2
    సి) N2O    డి) NO
12.    చర్మవ్యాధుల నివారణకు ఉపయోగించేది?
    ఎ)ZnS     బి) CaS 
    సి) HgS    డి) PbS 
13.    ఓలియంను నీటితో చర్య జరిపితే ఏర్పడే ఆమ్లం?
    ఎ) HNO3    బి) H2SO4
    సి) H2SO3    డి) H3PO3
14.    ఫాస్ఫరస్‌ మూలకం?
    ఎ)P8        బి)P4
    సి)P6       డి)P3
15.    కిందివాటిలో నిర్జలీకరణి?
    ఎ) H3PO4
    బి) Ca3(PO4)2
    సి) P2O5    
    డి) Na3PO4

16.    సూపర్‌ ఫాస్ఫేట్‌ ఆఫ్‌ లైమ్‌ ఒక? 
    ఎ) నత్రజని ఎరువు    
    బి) ఫాస్ఫాటిక్‌ ఎరువు
    సి) ΄÷టాషియం ఎరువు    
    డి) కాల్షియం ఎరువు
17.    అగ్గిపుల్ల తలలో ఉండే రసాయనిక పదార్థాలు?
    ఎ) KClO3, Sb2S3, బంక
    బి) KCl, SbCl3, బంక
    సి)  NaCl, Sb2S3, బంక
    డి) P4,Sb2S3, గాజుముక్కలు
18.    కాల్షియం ఫాస్ఫేట్‌ ృృృృృ ను కలిగి ఉంటుంది.
    ఎ) CO2(PO2)3    బి) CaHPO2
   సి) Ca3(PO4)2     డి) Ca(H2PO4)2
19.    ్క2ౖ5 ను చల్లని నీటిలో కరిగించినపుడు ఏర్పడేది?
    ఎ) H3PO4    బి) HPO3
    సి) PH3        డి) PH3, H3PO4
20.    ఫాస్ఫార్‌ బ్రాంజ్‌ అనే మిశ్రమలోహం 
సంఘటనం?
    ఎ) Cu + Sn + P    
    బి) Cu + Zn + P
    సి) Cu + Sn    
    డి) Cu + Mg + S 
21.    తెల్ల ఫాస్ఫరస్‌ను దేనిలో నిల్వ ఉంచుతారు?
    ఎ) Cs2    బి) కిరోసిన్‌
    సి) నీరు    డి) Cs2
22.    చీకటిలో భాస్వరాన్ని గాలిలో ఉంచితే నెమ్మదిగా మండి మెరుస్తుంది. దీన్ని ఏమంటారు?
    ఎ) ప్రతిదీప్తి    బి) రసాయనశక్తి
    సి) ఫాస్ఫారిజన్స్‌    డి) జీవదీప్తి
23.    కిందివాటిలో ఏది ఫాస్ఫారికామ్ల లవణం కాదు?
    ఎ) NaH2PO4     బి) Na2HPO4
    సి) Na3PO4       డి) H3PO4
24.    కిందివాటిలో దేన్ని ఎలుకల మందుగా ఉపయోగిస్తారు?
    ఎ) కాల్షియం ఫాస్ఫైడ్‌     
    బి) జింక్‌ ఫాస్ఫైడ్‌ 
    సి) మెగ్నీషియం ఫాస్ఫైడ్‌     
    డి) ఫాస్ఫీన్‌ 
25.    సముద్ర నీటిలో ఉప్పుశాతం?
    ఎ) 3.2%    బి) 2.8%
    సి) 4.6%    డి) 5.2%
26.    క్లోరిన్‌ వాయువు రంగు
    ఎ) ఎరుపు        బి) నీలం
    సి) ఆకుపచ్చ–పసుపు    
    డి) నలుపు
27.    నీటిలో హైడ్రోజన్‌ క్లోరైడ్‌ స్వభావం?
    ఎ) క్షారం    బి) ఆమ్లం
    సి) తటస్థ    డి) ద్వంద్వ
28.    టియర్‌ గ్యాస్‌ ఫార్ములా
    ఎ) COCl2
    బి) CaOCl2
    సి) CCl3NO2
    డి) CaSO4
29.    CHCl3ను ఏమంటారు?
    ఎ) బ్లీచింగ్‌ ΄ûడర్‌     
    బి) ఫాస్‌జీన్‌ 
    సి) క్లోరోఫాం    
    డి) అమాల్గం
30.    బ్రైన్‌ ద్రావణం అంటే?
    ఎ) ఉప్పు+ నీరు
    బి) చక్కెర+ నీరు
    సి) యూరియా+ నీరు
    డి) గ్లూకోజ్‌ + నీరు

సమాధానాలు
    1) బి;     2) డి;    3) సి;     4) సి; 
    5) బి;     6) డి;    7) ఎ;     8) బి; 
    9) సి;     10) సి;     11) బి;     12) సి;
    13) బి;     14) బి;     15) సి;     16) బి;
    17) ఎ;     18) సి;     19) బి;     20) ఎ; 
    21) సి;     22) సి;     23) డి;     24) బి;
    25) బి;     26) సి;     27) బి;     28) సి;
    29) సి;    30) ఎ.

గతంలో అడిగిన ప్రశ్నలు 
1.    సల్ఫ్యూరిక్‌ ఆమ్లంలోని మూలకాలు 
    ఎ) నత్రజని, సల్ఫర్, ఆక్సిజన్‌    
    బి) హైడ్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్‌
    సి) సల్ఫర్, ఆక్సిజన్‌    
    డి) ఫాస్ఫరస్, సల్ఫర్, హైడ్రోజన్‌ 
2.    వాసనలేని ఆమ్లానికి ఉదాహరణ
    ఎ) HNO3
    బి) H3PO4
    సి) HCl
    డి) H2SO4
3.    రంగులేని, చిక్కటి నూనె వంటి ఆమ్లం?
    ఎ)H2SO4
    బి) H3PO4
    సి) HNO3
    డి) HCl
4.    ఫాస్ఫారిక్‌ ఆమ్ల సంకేతం 
    ఎ) H3PO4    
    బి) H2SO4
    సి) HNO3
    డి) CH3cooh
5.    జడవాయువు కాని దానికి ఉదాహరణ
    ఎ) క్లోరిన్‌     
    బి) హీలియం
    సి) నియాన్‌ 
    డి) ఆర్గాన్‌ 

సమాధానాలు
    1) బి;     2) డి;     3) ఎ;     
    4) ఎ;    5) ఎ. 

#Tags