TGPSC Groups Results : మార్చి 2025 చివరినాటికి టీజీపీఎస్సీ గ్రూప్స్ ఫలితాలు విడుదల.. తక్కువ సమయంలోనే..!
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేసినట్లు తెలిపారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం. మొత్తం 783 పోస్టులకు ఈ పరీక్షను నిర్వహించగా, ఒక్కో పోస్టుకు 70 మంది చొప్పున పోటీ పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈనేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగాల ప్రకటన, పరీక్షల నిర్వాహణ, సంసర్కరణలు తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 2025 చివరికి ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని వివరించారు.
Job Mela 2024 for Freshers: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రేపు జాబ్‌మేళా, పూర్తి వివరాలివే!
ఇదిలా ఉంటే, మార్చి చివరిలోగా గ్రూప్-1,2,3 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఇక నుంచి జారీ చేసే నోటిఫికేషన్లలో ప్రిలిమ్స్, మెయిన్స్‌గా రెండు విడుతల్లో పోటీ పరీక్షలు ఉంటే గరిష్ఠంగా 9 నెలల్లోగా.. ఒకే ప్రధాన పరీక్ష ఉంటే 6 నెలల్లోగా తుది ఫలితాలు ప్రకటించేలా షెడ్యూల్ సిద్ధం చేస్తామని వెల్లడించారు టీజీపీఎస్సీ చైర్మన్. ఇకనుంచి, పరీక్షలకు కేవలం సిలబస్ మాత్రమే ప్రకటిస్తామని, పుస్తకాలు అభ్యర్థులే చూసుకోవాలని స్పష్టం చేశారు.
TGPSC Group 2 : అత్యంత కఠినంగా గ్రూప్-2 ప్రశ్నలు.. ఈసారి హాజరు శాతం కేవలం..
శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 15, 16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరుగుతాయని, రాష్ట్రవ్యాప్తంగా 1368 కేంద్రాల్లో జరుగుతున్నాయన్నారు. ఈ పరీక్షలో ప్రత్యక్షంగా 49848 మంది, పరోక్షంగా 75 వేల మంది అభ్యర్థులు పాల్గొంటున్నారని తెలిపారు. గతంలో 2015లో గ్రూప్-2 నోటిఫికేషన్ వేస్తే, నాలుగు సంవత్సరాలు అంటే, 2019 వరకు వేచి చూడాల్సి వచ్చింది. కాని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు తక్కువ సమయంలోనే నియామకాలను పూర్తి చేస్తామన్నారు టీజీపీఎస్సీ చైర్మన్.
డిసెంబర్ 18న..
ఈనెల 18, 19 తేదీల్లో కమిషన్ ఢిల్లీకి వెళ్లనుంది. ఒక రోజు, సీఐసీ, మరుసటి రోజు ఎస్ఎస్‌సీ, ఎన్‌టీఏ సంస్థలను కలవనున్నారు. ప్రభుత్వానికి నివేదిను జనవరి 2025 నాటికి అందిస్తామన్నారు. ఇక యూపీఎస్సీ, ఎస్ఎస్‌సీ షెడ్యూళ్లను పరిశీలించిన తరువాతే, టీజీపీఎస్సీ తేదీలను ఖరారు చేస్తుందన్నారు. భవిష్యత్తులో షెడ్యూల్లో ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)