TSPSC Group 4: గ్రూప్ 4లోనూ బ‌లగం సినిమాపై ప్ర‌శ్న‌...వైర‌ల్ అవుతున్న ప్ర‌శ్న‌ప‌త్రం

ఇటీవ‌లి కాలంలో చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన చిత్రం బ‌ల‌గం. జబర్దస్త్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి మొదటి సారి మెగాఫోన్‌ పట్టి ఈ సినిమాను తెర‌కెక్కించ‌గా, ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌ రామ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.
గ్రూప్ 4లోనూ బ‌లగం సినిమాపై ప్ర‌శ్న‌...వైర‌ల్ అవుతున్న ప్ర‌శ్న‌ప‌త్రం

థియేట‌ర్‌లో దుమ్మురేపిన ఈ సినిమా ఓటీటీలో కూడా అద‌ర‌గొడుతోంది. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రు మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తెలంగాణలోని చాలా పల్లెల్లో పెద్ద పెద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటుచేసుకుని మరీ బ‌ల‌గం సినిమాని వీక్షించారు.

Quiz of The Day (July 01, 2023): తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నది?

టీవీల్లో ప్ర‌సారం చేయ‌గా మొద‌టిసారి 14కి పైగా టీఆర్‌పీ రేటింగ్స్ సాధించి పెద్ద సినిమాల‌కు స‌వాల్ విసిరింది. ఈ సినిమాకి ఎన్నో అంత‌ర్జాతీయ అవార్డులు కూడా వ‌రించాయి. అయితే తాజాగా బలగం సినిమాపై తెలంగాణలో నిర్వ‌హించిన గ్రూప్ - 4 ప‌రీక్ష‌లో ప్ర‌శ్న అడిగారు.

బ‌ల‌గం చిత్రానికి సంబంధించి కింది జ‌త‌ల‌లో ఏవి స‌రిగ్గా జ‌త‌ప‌రిచిన‌వి?
ఎ. ద‌ర్శ‌కుడు : వేణు యెల్దండి
బి. నిర్మాత   : దిల్ రాజు, హ‌న్షితా రెడ్డి, హ‌ర్షిత్ రెడ్డి
సి. సంగీత ద‌ర్శ‌కుడు :  భీమ్స్ సిసిరోలియో\
డి. కొమ‌ర‌య్య పాత్ర‌ను పోషించిన‌వారు : అరుసం మ‌ధుసూధ‌న్‌

చ‌ద‌వండి: TSPSC Group 4 Paper-1 Question Paper (General Studies) (Held on 01-07-2023)

మ‌రి ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఏ, బీ, సీ... 
బ‌లగం సినిమాలో కొమ‌ర‌య్య పాత్ర‌ను కేతిరి సుధాక‌ర్ రెడ్డి పోషించారు. 

అలాగే ఈ ఏడాది నిర్వ‌హించిన పోలీస్ కానిస్టేబుల్ ప‌రీక్ష‌లోనూ బ‌లగం సినిమా మీద ప్ర‌శ్న‌లు అడిగారు. ఆ ప్ర‌శ్న ఏంటంటే... 

మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో బలగం సినిమాకు ఏ విభాగంలో పురస్కారం లభించింది?
ఎ. ఉత్తమ డాక్యుమెంటరీ
బి. ఉత్తమ నాటకం
సి. ఉత్తమ దర్శకుడు
డి. ఉత్తమ సంభాషణ 

మ‌రి ఈ ప్ర‌శ్న‌కి స‌మాధానం: ఉత్తమ నాటకం.

#Tags