TGPSC Group 2 Postpone Demand 2024 : గ్రూప్-2 వాయిదా వేయాలంటూ...?
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్న విషయం తెల్సిందే. అయితే డిసెంబర్ 16వ తేదీన ఆర్‌ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్(జేఈ) పరీక్ష జరగనుంది.
ఒకే రోజు రెండు పరీక్షలుండటంతో.. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై అభ్యర్థులు ఇటీవలే టీజీపీఎస్సీ చైర్మన్‌కు వినతిపత్రాన్ని కూడా ఇచ్చారు. అయినా కూడా గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండటంతో.. వీరు సోమవారం హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు.
➤☛ TGPSC Group 2 Exams Hall Tickets 2024 : గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల తేదీ ఇదే.. పరీక్షల సమయం ఇలా...
ఈ 20 మంది...
7,951 జూనియర్ ఇంజినీరింగ్(జేఈ) పోస్టులను రైల్వేశాఖ భర్తీచేస్తున్నది. బీటెక్, డిగ్రీ అర్హతలున్న వారు ఈ పోస్టులకు పోటీపడొచ్చు. ఇదే బీటెక్ అర్హత గల వారు గ్రూప్-2కు దరఖాస్తు చేసుకున్నారు. అటు గ్రూప్-2, ఇటు ఆర్‌ఆర్‌బీ రెండు పరీక్షలు రాసే వారు 20 మందికి పైగా ఉన్నట్టుగా తేలింది.
#Tags