APPSC Group-I 2nd Ranker 2023 Pavani Success Story : రైతు బిడ్డ.. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపిక.. ఎలాంటి కోచింగ్ లేకుండానే సాధించానిలా..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ Group 1 తుది ఫలితాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ ఆగస్టు 17వ తేదీన (గురువారం) ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ ఫలితాల్లో పావని స్టేట్ 2వ ర్యాంక్‌తో ఘనవిజయం సాధించి.. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికైన పావని సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
పావణి ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. వీరు వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు చెందిన వారు. ఈమె తండ్రి భూమిరెడ్డి గంగయ్య. తల్లి లక్ష్మీదేవి. పావణి వీరికి మొదటి సంతానం.
ఉద్యోగం చేస్తూనే.. ఎటువంటి కోచింగ్ లేకుండానే..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ Group-1 కి ఈమె లెక్చరర్ ఉద్యోగం చేస్తునే ప్రిపేరయ్యారు. ఒక వైపు ఉద్యోగం.. మరో వైపు గ్రూప్-1 ప్రిపరేషన్ సాగించారు. అలాగే గ్రూప్-1కి ఎటువంటి కోచింగ్ తీసుకోకుండానే కష్టపడి చదివి.. స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించారు. ఈ విజయంతో జిల్లా వాసులు ఈమె పొగడ్తలతో ముంచెత్తున్నారు. అలాగే బంధువులు, స్నేహితులు కూడా అభినందుస్తున్నారు.
☛ APPSC Group 2 Success Plan : ఇలా చదివితే గ్రూప్-2 కొట్టడం ఈజీనే.. | DR. ABDUL KAREEM SIR
ఎన్నో ఏళ్లుగా కలలు కన్నా.. నేడు
ఈ ర్యాంక్ సాధించడం పట్ల పావని ఆనందం వ్యక్తం చేశారు. తమ కుమార్తె డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సాధించడం పట్ల తండ్రి భూమిరెడ్డి గంగయ్య, తల్లి లక్ష్మీదేవి ఆనందంలో మునిగిపోయారు. ఎన్నో ఏళ్లుగా కలలు కన్నా ఉద్యోగం రావడం పట్ల భూమి రెడ్డి పావని ఆనందానికి అవధులు లేవు. సాధారణ రైతు కుటుంబం నుంచి అసాధారణ ఫలితాలను సాధించడం పట్ల గ్రామస్తులు అభినందించారు. ఈ స్థాయికి ఎదగడం పట్ల తన తల్లిదండ్రుల శ్రమ దాగి ఉందని పావని అభిప్రాయపడ్డారు.
ఈమె రెండో ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ ర్యాంక్‌తో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం రావడం ఇంకా సంతోషంగా ఉందన్నారు. అలాగే ఈ పరీక్షలకు చాలా కష్టపడి చదివానన్నారు. ఎంతో ఎఫెక్ట్ పెట్టి ఈ పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించానన్నారు. మెయిన్స్ ఎగ్జామ్స్‌లో రాసే టైమ్‌లో చాలా క్లారిటీగా ప్రశ్న అడిగే తీరు బట్టి సమాధానం ఇచ్చాన్నన్నారు.అలాగే ఇంటర్వ్యూలో చాలా మంచిగా జరిగిందన్నారు.
చదవండి: ఏపీపీఎస్సీ Group 1& 2 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్లైన్ టెస్ట్స్ | ఆన్లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్పీఎస్సీ
మొదటి పది స్ధానాలలో..
ముగ్గురు ఐఐఎం, 15 మంది ఐఐటీ అభ్యర్ధులు ఇంటర్వ్యూలకి వచ్చిన వాళ్లలో ఉన్నారు. ఎంపికైన వారిలో మొదటి పది స్ధానాలలో ఆరుగురు మహిళా అభ్యర్ధులే ఉన్నారు. టాప్ ఫైవ్ లో తొలి మూడు ర్యాంకర్లు మహిళలదే.