Group 2 Exam: గ్రూప్‌–2 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు బీసీ స్టడీసర్కిల్‌ ఆధ్వర్యంలో ఆఫ్‌లైన్‌ గ్రాండ్‌ టెస్టులు... ఎక్క‌డంటే..

గ్రూప్‌–2 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు బీసీ స్టడీసర్కిల్‌ ఆధ్వర్యంలో ఆఫ్‌లైన్‌ గ్రాండ్‌ టెస్టులు నిర్వహిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీమతి టి.శైలజ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

హనుమకొండలోని బీసీస్టడీ సర్కిల్‌లో జూలై 8, 9, 15, 16, 22, 23, 30, 31 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెస్టులకు హాజరయ్యే జిల్లాకు చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా జూలై 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 040–24071178 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలన్నారు.

☛ TSPSC Group 2 & 3 Posts 2024 Increase : గ్రూప్–2, గ్రూప్-3 పోస్టుల సంఖ్య భారీగా పెంపు..? ఇంకా గ్రూప్‌-1కు 1:100 నిష్ప‌త్తిలో..

ఉచితంగా లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌
భూపాలపల్లి రూరల్‌: సివిల్‌ సర్వీసు 2025 సంవత్సరంలో పరీక్ష రాసే అభ్యర్థులకు వెనుకబడిన తరగతుల ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కేంద్రం బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి టి.శైలజ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకు చెందిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాలని కోరారు. డిగ్రీ పాసైన అభ్యర్థులు జూలై 3వ తేదీలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ నంబర్‌ 040–24071178ను సంప్రదించాలని పేర్కొన్నారు.

#Tags