APPSC Group 1 Rankers Success Stories : ఒకే ఇంట్లో అన్నదమ్ములకు గ్రూప్-1 ఉద్యోగాలు.. కొట్టారిలా..
మొత్తం 111 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే ఈ ఫలితాల్లో ఒకే కుటుంబంకు చెందిన అన్నదమ్ములు సత్తా చాటారు. వీరే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వెంకట సాయిరాజేష్, వెంకట సాయిమనోజ్. ఈ నేపథ్యంలో వెంకట సాయిరాజేష్, వెంకట సాయిమనోజ్ సక్సెస్ స్టోరీ మీకోసం..
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పోలుమహంతి ఉమామహేశ్వరరావు బీసీ సంక్షేమశాఖలో పని చేసి రిటైరయ్యారు. తల్లి సాయి సుజాత స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతుల ఇద్దరు కుమారులే.. వెంకట సాయిరాజేష్, వెంకట సాయిమనోజ్. ప్రస్తుతం పెద్ద కుమారుడు వెంకట సాయిరాజేష్ అగ్నిమాపక అధికారిగా పని చేస్తుండగా.. చిన్న కుమారుడు వెంకట సాయిమనోజ్ వైద్యారోగ్యశాఖలో పరిపాలనాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. అన్నదమ్ములిద్దరు బీటెక్ పూర్తి చేశారు.. ఏడేళ్ల నుంచి ఢిల్లీలో సివిల్స్ శిక్షణలో ఉన్నారు. ఈ దంపతుల ఇద్దరు కుమారులు గ్రూప్-1 ఫలితాల్లో ఒకేసారి ఉద్యోగాలు సాధించారు.
మొత్తం 111 ఉద్యోగాల భర్తీకి ఎంపిక చేసిన వారిలో 33 మంది మహిళలు ఎంపిక కావడం విశేషం. 111 ఉద్యోగాల్లో ఒక పోస్టును స్పోర్ట్స్ కోటాలో భర్తీపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ 111 పోస్టుల్లో రాష్ట్ర కేడర్‌కు చెందిన డిప్యూటీ కలెక్టర్ 13, సీటీఓ-13, డీఎస్పీ (సివిల్) 13, డీఎస్పీ (జైళ్లు) 2, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్-2, ఏటీఓ (టీ అండ్ ఏ సర్వీస్) పోస్టులు 11 ఉన్నాయి. డీఎస్పీ (జైళ్లు), డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్టుల మినహా మిగిలిన పోస్టులకు ఎంపికైన వారిలో 14 మంది మహిళలు ఉన్నారు.