Inspirational Success Story : ఆ స్వేచ్చతోనే.. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్న‌త ఉద్యోగాలు కొట్టారు.. ఒక‌రు డీఎస్పీ.. మ‌రోక‌రు మేజ‌ర్‌..

ఇంట్లో ఆడ‌పిల్ల పుట్టితే.. బాధప‌డే త‌ల్లిదండ్రులు నేటికి ఉన్నారు. అలాగే నేటి స‌మాజంలో కూడా ఆడ‌పిల్లల‌కు ఎన్నో.. క‌ట్టుబాట్లు విధిస్తున్నారు త‌ల్లిదండ్రులు. కానీ ఇప్పుడు మ‌నం చెప్పే స‌క్సెస్ స్టోరీలో ఈ ఇద్ద‌రి ఆడ‌పిల్ల‌ల తల్లిదండ్రులు పైన చెప్పిన విధంగా కాదు.
Two sisters pratibha and pradeepthi success

నేటి స‌మాజంకు అనుగుణంగా తమ కూతుర్లకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు కావాల్సిన స్వేఛ్చను అందించారు. ఆ స్వేఛ్చే నేడు ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఉన్న‌త‌శిఖరాల‌కు చేర్చింది. వీరే ప్రతిభ, ప్రదీప్తి. ప్రదీప్తి డీఎస్పీగా, ప్రతిభ ఆర్మీలో మేజర్‌గా ఉన్న‌త ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వీరి స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం : 
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని కొర్లకోట వీరిది. తండ్రి పేడాడ అప్పారావు. తల్లి సుగుణవేణి. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే.

☛ APPSC Group-1 First Ranker Rani Susmita Interview : గ్రూప్‌-1 ఫ‌స్ట్ ర్యాంక్ కొట్టానిలా.. ఇలా చ‌దివితే..

ప్రతిభ చిన్న వ‌య‌స్సులోనే.. భారత సైన్యంలోకి..
21 ఏళ్లకే భారత సైన్యంలో చేరింది ప్రతిభ. లెఫ్టినెంట్‌గా ఎంపికై శిక్షణ అనంతరం జమ్మూ కశ్మీర్‌, బారాముల్లా బెటాలియన్‌లో పనిచేసింది. ఆ తర్వాత కెప్టెన్‌గా, మేజర్‌గా పదోన్నతి సాధించి.. ఐక్యరాజ్యసమితి భద్రతా దళాల విభాగంలో పనిచేసే అవకాశం దక్కించుకుంది. త్వరలోనే ఆమె శాంతి స్థాపన కోసం మనం దేశం తరఫున విధులు నిర్వహించేందుకు సౌత్‌ సుడాన్‌ వెళ్లనుంది.

ఎస్‌ఐ నుంచి డీఎస్పీగా ప్రదీప్తి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షల్లో(2022) ఉత్తీర్ణత సాధించి ఎక్సైజ్‌ శాఖలో ఎస్‌ఐగా ఉద్యోగం సంపాదించింది ప్రదీప్తి. ఆ విధులు నిర్వహిస్తూనే మరోసారి పరీక్షలు రాసి.. తాజాగా విడుదలైన గ్రూప్‌-1 ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది.

☛ APPSC Group 1 Ranker Sreenivasulu Raju : గ్రూప్‌-1 స్టేట్ 2nd ర్యాంక‌ర్ స‌క్సెస్ స్టోరీ..|| నేను చదివిన పుస్తకాలు ఇవే..

ఈ తెలుగింటి ఆణిముత్యాలైన ఇద్దరు అక్కా చెళ్లెల్లు(ప్రతిభ, ప్రదీప్తి) ఎన్నో సవాళ్లను, అవరోధాలను ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యాలను సాధించారు. ఇద్దరూ చదువు చెప్పే గురువులకు కావడంతో.. పిల్లల చదువు విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇద్దరు పిల్లలు సాధించిన విజయాల గురించి సమాజం మాట్లాడుకుంటుంటే ఆ తల్లిదండ్రుల ఆనందం మాటల్లో వర్ణించేలేనిది. ఒకరు రాష్ట్రానికీ, మరొకరు దేశానికీ సేవలందిస్తునందుకు తల్లిదండ్రులుగా గర్వంగా ఉందని చెప్తున్నారు.

వీరు స్వేచ్ఛను ఏనాడూ వమ్ముచేయలేదు. చదువులో రాణించి బీటెక్‌ పూర్తిచేశారు. ఇక తెలిసినవాళ్లంతా బాగా చదువుతారు కాబట్టి పెద్దగా శ్రమ ఉండని ఐటీ ఉద్యోగమో, బ్యాంకు ఉద్యోగమో ఎంచుకొమ్మని సలహా ఇచ్చారు. కానీ వారి ఆలోచనలు వేరు. ప్రదీప్తి పోలీస్‌ ఉద్యోగంలో చేరాలనుకుంటే.. ప్రతిభ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంది. యూనిఫాం ఉద్యోగాలు కావడంతో మొదట తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పినా.. తర్వాత వాళ్ల ఇష్టానికే వదిలేశారు. 

ఈ ఉద్యోగాలకు ఫిట్‌నెస్ ఎంతో అవ‌స‌రం. ఇందుకోసం గ్రౌండ్‌లో సాధన చేస్తున్నప్పుడు.. హాయిగా పెళ్లిళ్లు చేసుకోక.. ఎందుకొచ్చిన బాధలు అంటూ.. అంతా దెప్పిపొడిచినా లక్ష్య సాధనే ధ్యేయంగా శ్రమించారు.. ఈ ఇద్ద‌రు అమ్మాయిలు. ఈ అమ్మాయిలు తమకు నచ్చిన రంగం వైపు భయపడకుండా అడుగులు వేసేందుకు కావాల్సిన ధైర్యాన్నివ్వండి. ఆ తర్వాత అద్భుతాలు జరుగుతాయి అంటోంది మేజర్‌ ప్రతిభ.

#Tags