APPSC Group 1 Ranker Swathi Success Story : వీటిపై పట్టు ఉంటే.. గ్రూప్-1లో విజయం మీదే.. డిప్యూటీ కలెక్టర్ స్వాతి..
లాఠీ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు ఆమె పడ్డ కష్టాలు.. ఆనంద క్షణాలు.. సాక్షిఎడ్యుకేషన్.కామ్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చూడొచ్చు..
కుటుంబ నేపథ్యం :
అనంతపురం జిల్లా, హిందూపురం మండలం, గురవనహళ్లికి చెందిన రత్నమ్మ, నాగరాజు దంపతుల గారాలపట్టి స్వాతి. చిన్ననాటి నుంచి చదువులో చురుగ్గా రాణించేది.
☛ APPSC Group 1 State 1st Ranker Bhanusri Interview : నా సక్సెస్ సీక్రెట్ ఇదే..|నేను చదివిన పుస్తకాలు ఇవే.. (Click Here)
ఎడ్యుకేషన్ :
స్వాతి.. 2008లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అలాగే 2010లో ఇంటర్‌లో కూడా అత్యుత్తమ మార్కులు సాధించింది. 2013లో హిందూపురంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది.
భర్త.. అత్తమామల సహాకారంతో..
స్వాతికి.. ఒంగోలుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మహేష్‌తో వివాహమైంది. స్వాతిలో చదువుకోవాలనే పట్టుదల చూసిన భర్త ఆమెను పోటీ పరీక్షలకు సిద్ధం చేశారు. దానికి అత్తామామలు సైతం పూర్తిగా సహాయసహకారం అందించేవారు.
☛ ఎలాంటి కోచింగ్ లేకుండానే.. గ్రూప్-1 ఉద్యోగం కొట్టానిలా.. నా సక్సెస్ ప్లాన్ ఇదే..
'ఎస్‌ఐ' టూ.. డిప్యూటీ కలెక్టర్‌గా..
స్వాతి.. 2018లో స్వాతి ఎస్‌ఐగా ఎంపికయ్యారు. తిరుచానూరు, గాజులమండ్యం, శ్రీకాళహస్తి టూటౌన్ పోలీస్ స్టేషన్లలో ఎస్‌ఐగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం తిరుపతిలో స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. మరింత ఉన్నత స్థాయికి చేరాలని గ్రూప్–1 పరీక్షలకు సిద్ధమయ్యారు. 2022లో జరిగిన గ్రూప్–1 పోటీ పరీక్షల్లో ఎనిమిదో ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. గ్రూప్–1 పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే పోస్టు దక్కాలనే కసితో హైదరాబాద్‌లోని RC Reddy IAS Study Circle లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
చాలా థ్రిల్లింగా..
ఎస్‌ఐగా పనిచేస్తూనే మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని సంకల్పించా. భర్త మహేష్, అత్తామామలు పూర్తిగా సహకరించారు. వివాహమనంతరం గ్రూప్–1 పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యా. చదువుకుంటానంటే మరో ఆలోచన లేకుండా కుటుంబ సభ్యులు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నాకు డెప్యూటీ కలెక్టర్ రావడం చాలా థ్రిల్లింగా ఉంది.
పర్సనల్ లైఫ్‌కు సైతం దూరంగా ఉండి.. ఇలా చదివా..
సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నేను ఎదుర్కొన్న కొన్ని సవాళ్లతో పాటు.. పై స్థాయికి వెళ్లాలంటే కష్టపడనిదే ఫలితం దక్కదని ఆలోచించా. అధిక సమయం చదవడానికి మొగ్గుచూపా. పర్సనల్ లైఫ్‌కు సైతం దూరంగా ఉన్నా. చదువుపైనే ఎక్కువ ధ్యాస పెట్టేదాన్ని. వేతనాన్ని కూడా వదులుకొని రోజుకు 12 గంటల పాటు చదివేదాన్ని. అధిక శాతం రివిజన్ ద్వారానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ర్యాంకులు సాధించగలం. గ్రూప్–1 ఆఫీసర్‌గా ఈరోజు ర్యాంకు సాధించగలిగానంటే కేవలం నా భర్త సహకారంతోనే అని స్వాతి తెలిపారు.
వీటిపై పట్టు ఉంటే.. విజయం మీదే..
గ్రూప్–1లో ర్యాంకు సాధించాలంటే కొన్నాళ్లు మన ఆనందాలకు దూరంగా ఉండాలి. 100 శాతం మనం అనుకున్న లక్ష్యం వైపే మన చూపు ఉండాలి. మన జ్ఞానాన్ని పెంచుకునే విధంగా అవసరమైన పుస్తకాలు, న్యూస్ పేపర్లలో వచ్చే ఆర్టికల్స్‌ను చదువుతూ ఉండాలి. వీలైనన్ని సార్లు ప్రతి సబ్జెక్టును రివిజన్ చేసుకోవాలి. బట్టీ పట్టి ర్యాంకు సాధిస్తామంటే అది సాధ్యమయ్యే పనికాదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలి.
స్వాతి (డిప్యూటీ కలెక్టర్) పూర్తి ఇంటర్వ్యూ కింది వీడియో చూడొచ్చు..