TSPSC Group 1: గ్రూప్‌ 1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు..

కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన కలెక్టర్‌ జూన్‌లో నిర్వహించనున్న టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ 1 పరీక్ష ఏర్పాట్ల గురించి వివరించారు..

కామారెడ్డి క్రైం: టీఎస్పీఎస్సీ ద్వారా జూన్‌ 9న నిర్వహించే గ్రూప్‌–1 పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు కేటాయించే అభ్యర్థులకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో 12 పరీక్ష కేంద్రాలను గుర్తించామన్నారు.

Free Employment Training: నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ

డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, రూట్‌ అధికారులు, ఇన్విజిలెటర్లను నియమించాలని సూచించారు. ప్రతి కేంద్రం సీసీ కెమెరా నిఘాలో ఉంటుందన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఆర్డీవో రఘునాథ్‌రావు, డీఈవో రాజు, పరీక్షల సహాయ కమిషనర్‌ లింగం, ఇంటర్‌ బోర్డు నోడల్‌ అధికారి షేక్‌ సలాం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ విజయ్‌ కుమార్‌, తహసీల్దార్‌ జనార్దన్‌, విద్యుత్‌, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.

School Exams: షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి

#Tags