TGPSC Group1 Prelims Answer Key: గ్రూప్-1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ విడుదల..అభ్యంతరాలకు 17 వరకు అవకాశం
గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల అయ్యింది. ఈ నెల 17 వరకు ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకు గాను 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3.02 లక్షల మంది (74 శాతం)ప్రిలిమ్స్ పరీక్షకుఅభ్యర్థులు హాజరయ్యారు.
జూన్9న 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాలను https://websitenew.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ కీతోపాటు ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
#Tags