TGPSC Group 1 Mains Exam: గ్రూప్‌-1 మెయిన్స్‌ వాయిదా వేయండి.. అభ్యర్థుల డిమాండ్‌!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రిలిమ్స్‌ కీపై వివిధ కోర్టుల్లో ఉన్న పెండింగ్‌ కేసులను పరిష్కరించాలని, సాధ్యం కాని పక్షంలో పరీక్షలను వాయిదా వేయాలని పలువురు టీజీపీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డిని కోరారు.

TGPSC Group 1 Mains Schedule: గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ రిలీజ్‌.. పరీక్షలు ఎప్పుడంటే?

'కీ'లో దొర్లిన తప్పులపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారని గుర్తుచేశారు. ఈ మేరకు వినతి పత్రాలను అందజేశారు. కాగా అక్టోబర్‌ 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలు జరుగనున్న విషయం తెలిసిందే. మెయిన్స్‌ పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు.

Group-I Recruitment: గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

దీని ప్రకారం మెయిన్స్‌ పరీక్షలు అక్టోబరు 21వ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్‌ 27తో ముగుస్తాయి. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మరికొద్ది రోజుల్లోనే మెయిన్స్‌ ప్రారంభం కానున్న సమయంలో కొందరు అభ్యర్థులు పరీక్షలను వాయిదా వేయాలని కోరడం గమనార్హం. 
 

#Tags