Group-I Recruitment: గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యాలు

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ల అమలు తీరుపై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీ ఎస్‌పీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలోగా కౌంటర్‌ దాఖలు చేయాలంటూ విచారణను సెప్టెంబర్‌ 27కు వాయిదా వేసింది. గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించే మెయిన్స్‌ పరీక్షలకు అర్హుల ఎంపిక విషయంలో మార్పులు చేయాలని టీజీఎస్‌పీ ఎస్సీ కార్య దర్శి నుంచి గత ఫిబ్రవరి 2, 6 తేదీల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. 

గతంలోని జీఓ 55లోని పేరా ‘బీ’లో సవరణలు చేయాలని కోరుతూ ఆ ప్రతిపాదనలు పంపగా, వీటికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు సీఎస్‌  శాంతికుమారి జీఓ 29ను ఫిబ్రవరి 8న జారీ చేశారు. ఈ జీవో చట్టవిర్ధుమని, సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కిందకే వస్తుందంటూ సికింద్రాబాద్‌కు చెందిన హనుమాన్‌తోపాటు మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Wipro Cuts Offer Letters To Freshers: ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన విప్రో.. ఆ నియామకాలన్నీ రద్దు

రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను కేటగిరీల వారీగా 1ః50 నిష్పత్తిని అమలు చేసేలా సర్కార్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ కాజా శరత్‌ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపించారు. 

జీవో 29 చట్టవిరుద్ధం: ‘గ్రూప్‌–1 మెయిన్స్‌కు ఎంపిక జాబితా 1ః50 నిష్పత్తిలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు సరిపోయేలా ఉండాలి. జీవో 55 అదే చెబుతోంది. అయితే దీన్ని సవరిస్తూ తెచ్చిన జీవో 29 ప్రకారం.. తొలుత మెరిట్‌ జాబితా నుంచి 1ః50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి, ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రకారం లెక్క సరిపోకపోవడంతో మరికొందరిని చేరుస్తూ వెళ్లారు. దీంతో మొత్తంగా ఎంపికైన అభ్యర్థుల సంఖ్య పెరిగింది. 

Modem Vamsi Success Story: కూలీగా మొదలైన ప్రస్థానం.. ఇప్పుడు కామన్‌వెల్త్‌ వరకు

563 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇందులో జనరల్‌–209, ఈడబ్ల్యూఎస్‌–49, బీసీ(ఏ)–44, బీసీ(బీ)–37, బీసీ(సీ)–13, బీసీ(డీ)–22, బీసీ(ఈ)–16, ఎస్సీ–93, ఎస్టీ–52, స్పోర్ట్స్‌కోటా–4, పీహెచ్‌సీ–24 చొప్పున పోస్టులు రిజర్వు చేసింది. మెయిన్స్‌కు 1ః50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ఎంపికైన అభ్యర్థుల నిష్పత్తి 1ః50ని దాటింది. రిజర్వేషన్లు సరిగా పాటించకపోవడంతో ఇది జరిగింది’ అని చెప్పారు.

#Tags