APPSC Group 1: స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్ కమిషనర్‌గా భార్గవ్‌

స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్ కమిషనర్‌గా భార్గవ్‌

రాజాం సిటీ: పట్టణ పరిధి సారథి గ్రామానికి చెందిన వావిలపల్లి భార్గవ్‌ గ్రూప్‌– 1 ఫలితాల్లో స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఎంపికయ్యారు. ఆయన 1 నుంచి 10వ తరగతి వరకు రాజాంలోని శారదా కాన్వెంట్‌లో చదివి 557 మార్కు లు సాధించారు.. ఇంటర్మీడియట్‌ విద్యను స్థానిక వేదగాయత్రి కళాశాలలోను, ఇంజినీరింగ్‌ విద్యను జీఎంఆర్‌ ఐటీలో పూర్తిచేశారు. స్టేట్‌బ్యాంకు క్యాషియర్‌గా ఉద్యోగం సాధిస్తూ గ్రూప్స్‌కు సిద్ధమై విజయం సాధించారు.. సివిల్స్‌ సాధించడం లక్ష్యమని, ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్టు భార్గవ్‌ తెలిపారు. ఆయన తల్లి ఈశ్వరమ్మ గృహిణికాగా, తండ్రి విష్ణు జి.సిగడాం మండలం పాలఖండ్యాం యూపీ పాఠశాలలో హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నారు.

ఇవీ చ‌ద‌వండి: APPSC Group 1లో బొగ్గరం యువకుడి సత్తా

 

ఇవీ చ‌ద‌వండి: APPSC Group 1 Second Ranker 2023 Pavani Success Story

ఇవీ చ‌ద‌వండి: APPSC Group-1 First Ranker Bhanusri Lakshmi Success Story 

#Tags