సౌర కుటుంబం అంచులు దాటిన వాయేజర్-2

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన వాయేజర్-2 అంతరిక్ష నౌక సౌర కుటుంబం అంచులు దాటి వెళ్లింది.
సూర్యుడి ప్రభావం లేని, నక్షత్ర మండలంలోకి (ఇంటర్‌స్టెల్లార్ స్పేస్ మీడియం-ఐఎస్‌ఎంకు) 2018 నవంబర్ 5వ తేదీన చేరుకుంది. ఈ విషయాలను నాసా 2019, నవంబర్ 6న వెల్లడించింది. దీంతో ఆ ఘనతను సాధించిన రెండో వ్యోమనౌకగా వాయేజర్-2 నిలిచింది. అంతకుముందు నాసాకి చెందిన వాయేజర్-1 2012లో సౌర కుటుంబాన్ని దాటి వెళ్లింది.

వాయేజర్-2 విశేషాలు
  • అంతరిక్షంలో ప్రయాణించిన కాలం : 41 ఏళ్లు
  • వేగం /గంటకు మైళ్లలో : 34,191
  • సూర్యుడి నుంచి వాయేజర్ -2 ఉన్న దూరం : 1,770 కోట్ల కిలోమీటర్లు...
  • ప్రయాణించిన మొత్తం దూరం : 3,000 కోట్ల కిలోమీటర్లు
  • సందర్శించిన గ్రహాల సంఖ్య : 4 (గురు, శని, వరుణ, నెప్ట్యూన్)
  • సూర్య కిరణాలు వాయేజర్‌ను చేరేందుకు పట్టే సమయం : 16 గంటల 36 నిమిషాలు
  • వాయేజర్-2 నుంచి భూమికి సమాచారం అందడానికి పడుతున్న సమయం : 19 గంటలు
  • గ్రహాంతర వాసుల కోసం ఒక సందేశాన్ని ముద్రించిన బంగారు ఫలకం వాయేజర్-2 ఉంది. ఈ ఫలకంపై 14 ప్రత్యేక నక్షత్రాల సాయంతో సూర్యుడిని ఎక్కడ గుర్తించవచ్చు?, హైడ్రోజన్ పరమాణవు చిత్రంతోపాటు మరికొన్ని సంకేతాలు ఉన్నాయి.
  • 1977లో కొన్ని వారాల వ్యవధిలో నాసా వాయేజర్-1, వాయేజర్-2లను ప్రయోగించింది. రెండు అంతరిక్ష నౌకలూ సూర్యుడి ప్రభావం నుంచి దాదాపు ఒకే దూరం తరువాత బయటపడ్డాయి. దీన్ని బట్టి సౌరకుటుంబం ఆకారం గోళాకారంగానే ఉంటుందని అర్థమైందని ఐయోవా యూనివర్సిటీ శాస్త్రవేత్త బిల్‌కుర్త్ తెలిపారు.
#Tags