New Central Cabinet Ministers List and Positions 2024 : కొత్త‌గా కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖ‌లు ఇవే.. ఏఏ మంత్రికి ఏఏ ప‌ద‌వి వ‌చ్చిందంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా మోదీ సహా 72 మందితో పూర్తిస్థాయి నూతన కేంద్ర మంత్రివర్గం కూడా ఈ సందర్భంగా కొలువుదీరింది. 30 మందితో కేబినెట్‌ మంత్రులుగా, ఐదుగురితో స్వతంత్ర, 36 మందితో సహాయ మంత్రులుగా రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయించారు.

బీజేపీకి పూర్తి మెజారిటీ రాని నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన ఎన్డీఏ మిత్రపక్షాలకు మంత్రివర్గంలో 11 బెర్తులతో సముచిత ప్రాధాన్యం దక్కింది. జూన్ 10వ తేదీన‌.. కేంద్ర కేబినెట్‌ సమావేశం జ‌రిగింది. అలాగే ఈ రోజు.. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్రధాన మంత్రి కేంద్రమంత్రులకు శాఖలను కేటాయించారు.  

కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు 2024 ఇవే..

1. రాజ్‌నాథ్‌ సింగ్‌ (భాజపా) ☛ రక్షణ శాఖ
2. అమిత్ షా (భాజపా)☛ హోంమంత్రిత్వ శాఖ
3. నితిన్ గడ్కరీ (భాజపా)☛ రోడ్లు, రహదారులు
4. జగత్ ప్రకాశ్ నడ్డా (భాజపా)☛ ఆరోగ్యశాఖ
5. శివరాజ్ సింగ్ చౌహాన్ (కొత్త) (భాజపా)☛ వ్యవసాయం, రైతు సంక్షేమం
6. నిర్మలా సీతారామన్ (భాజపా) ☛ ఆర్థికశాఖ
7. సుబ్రహ్మణ్యం జైశంకర్ (భాజపా) ☛ విదేశీ వ్యవహారాలు
8. మనోహర్ లాల్ ఖట్టర్ (కొత్త) (భాజపా)☛ విద్యుత్‌, గృహనిర్మాణశాఖ
9. హెచ్.డి. కుమారస్వామి (కొత్త) (జేడీఎస్)☛ భారీ పరిశ్రమలు, ఉక్కు
10. పీయూష్ వేద్ ప్రకాశ్ గోయల్ (భాజపా) ☛ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌
II. ధర్మేంద్ర ప్రధాన్ (భాజపా) ☛ విద్యాశాఖ
12. జీతన్ రామ్ మాంఝి (కొత్త) (హెచ్ఎఎం) ☛ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
13. రాజీవ్ రంజన్ (లలన్)సింగ్ (కొత్త) (జేడీయూ) ☛ పంచాయతీరాజ్‌; మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ
14. సర్బానంద్ సోనోవాల్ (భాజపా)☛ షిప్పింగ్‌, పోర్టులు
15. వీరేంద్ర కుమార్ (భాజపా) ☛ సామాజిక న్యాయం, సాధికారత 
16. కింజరాపు రామ్మోహన్ నాయుడు (కొత్త) (తెదేపా) ☛ పౌర విమానయాన శాఖ
17. ప్రహ్లాద్ వెంకటేష్ జోషి (భాజపా) ☛ వినియోగదారుల వ్యవహారాలు; ఆహార, ప్రజాపంపిణీ; నూతన, పునరుత్పాదక ఇంధనం
18. జుయెల్ ఓరం (కొత్త) (భాజపా) ☛ గిరిజన వ్యవహారాలు
19. గిరిరాజ్ సింగ్ (భాజపా) ☛ జౌళి పరిశ్రమ
20. అశ్వినీ వైష్ణవ్ (భాజపా) ☛ రైల్వే, సమాచార - ప్రసారాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌
21. జ్యోతిరాదిత్య సింధియా (భాజపా) ☛ కమ్యూనికేషన్స్‌, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
22. భూపేంద్ర యాదవ్ (భాజపా) ☛ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు
23. గజేంద్రసింగ్ షెకావత్ (భాజపా)☛ పర్యాటక, సాంస్కృతికశాఖ
24. అన్నపూర్ణాదేవి (కొత్త) (భాజపా) - మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
25. కిరణ్ రిజిజు (భాజపా) ☛ పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు
26. హర్దీప్ సింగ్ పూరి (భాజపా) ☛ పెట్రోలియం, సహజవాయువులు
27. మనస్సుఖ్ ఎల్. మాండవీయ (భాజపా) ☛ కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు - యువజన వ్యవహారాలు
28. గంగాపురం కిషన్ రెడ్డి (భాజపా) ☛ బొగ్గు, గనులు
29. చిరాగ్ పాస్వాన్ (కొత్త) (ఎలేపీ-పాస్వాన్) ☛ ఆహార శుద్ధి పరిశ్రమలు
30. సి.ఆర్.పాటిల్ (కొత్త) (భాజపా) ☛ జలశక్తి

☛ Union Council of Ministers: తొలిసారి కేంద్రమంత్రి పదవి చేపట్టిన వారిలో పలువురి విశేషాలు ఇవే..!

సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) :
31. రావ్ ఇంద్రజిత్ సింగ్ (భాజపా) ☛ గణాంకాలు, కార్యక్రమాల అమలు, సాంస్కృతిక
32. జితేంద్రసింగ్ (భాజపా) ☛ శాస్త్ర సాంకేతిక,, భౌగోళిక శాస్త్ర, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది వ్యహారాలు, పించన్లు, అణు ఇంధనం, అంతరిక్షం
33. అర్జున్ రామ్ మేఘ్ వాల్ (భాజపా) ☛ న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాలు
34. ప్రతాప్ రావ్ గణపత్‌రావ్‌ జాదవ్‌ (కొత్త) (శివసేన) ☛  ఆయుష్‌, ఆరోగ్య - కుటుంబ సంక్షేమం
35. జయంత్ చౌధరి (కొత్త) (ఆర్ఎల్డీ) ☛ నైపుణ్యాభివృద్ధి, ఆంత్రపెన్యూర్‌, విద్య

☛ Foreign Leaders: మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన‌ 7 దేశాల అధినేతలు వీరే..

సహాయ మంత్రులకు కేటాయించిన శాఖలు 2024 ఇవే..  :  

36. జితిన్ ప్రసాద (కొత్త) (భాజపా) ☛ వాణిజ్య, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్
37. శ్రీపాద్‌ యశో నాయక్ (భాజపా) ☛ విద్యుత్తు, కొత్త పునరుత్పాక ఇంధనం
38. పంకజ్ చౌధరి (భాజపా) ☛ ఆర్థికం
39. క్రిషన్ పాల్ (భాజపా) ☛ సహకారం
40. రామ్ దాస్ అఠావలె (ఆర్ పీఐ)☛ సామాజిక న్యాయం, సాధికారత
41. రామ్ నాథ్ ఠాకూర్ (కొత్త) (జేడీయూ) ☛ వ్యవసాయ, రైతు సంక్షేమం
42. నిత్యానందరాయ్ (భాజపా) ☛  హోం
43. అనుప్రియ పటేల్ (అప్నాదళ్) ☛ ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు - రసాయనాలు
44. వి.సోమన్న (కొత్త) (భాజపా) ☛ జల్‌ శక్తి, రైల్వే
45. పెమ్మసాని చంద్రశేఖర్ (కొత్త) (తెదేపా) ☛ గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌
46. ఎస్.పి.సింగ్ బఘేల్ (భాజపా) ☛ మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ, పంచాయతీ రాజ్‌
47. శోభా కరంద్లాజే (భాజపా) ☛ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి
48. కీర్తివర్ధన్‌ సింగ్‌ (కొత్త) (భాజపా) ☛ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ 
49. బీఎల్ వర్మ (భాజపా) ☛ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార - ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం ☛ సాధికారత
50. శాంతనూ ఠాకూర్ (భాజపా) ☛ పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌
51. సురేష్ గోపి (కొత్త) (భాజపా) ☛ పెట్రోలియం, సహజవాయువులు, పర్యటకం
52. ఎల్.మురుగన్ (భాజపా) ☛ సమాచార - ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు
53. అజయ్ టమ్టా (భాజపా) ☛ రోడ్డు రవాణా, హైవేలు
54. బండి సంజయ్‌ కుమార్‌ (కొత్త) (భాజపా) ☛ హోం  
55. కమలేష్ పాశ్వాన్ (కొత్త) (భాజపా) ☛ గ్రామీణాభివృద్ధి
56. భగీరథ్ చౌదరి (కొత్త) (భాజపా) ☛ వ్యవసాయ, రైతు సంక్షేమం
57. సతీశ్ చంద్రదూబే (కొత్త) (భాజపా) ☛ బొగ్గు, గనులు
58. సంజయ్ సేఠ్ (కొత్త) (భాజపా) ☛ రక్షణ
59. రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ (కొత్త) (భాజపా) ☛ ఆహార శుద్ధి పరిశ్రమ, రైల్వేలు
60. దుర్గాదాస్ ఉయికె (కొత్త) (భాజపా) ☛ గిరిజన వ్యవహారాలు
61. రక్షా నిఖిల్ ఖడ్సే (కొత్త) (భాజపా) ☛ యువజన వ్యవహారాలు - క్రీడలు
62. సుఖాంత మజుందార్ (కొత్త) (భాజపా) ☛ విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
63. సావిత్రి ఠాకుర్ (కొత్త) (భాజపా) ☛ మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
64. టోకన్ సాహు (కొత్త) (భాజపా) ☛ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు
65. రాజ్‌ భూషణ్ చౌదరి (కొత్త) (భాజపా) ☛  జల్‌ శక్తి
66. భూపతిరాజు శ్రీనివాస వర్మ (కొత్త) (భాజపా) ☛ భారీ పరిశ్రమలు, ఉక్కు
67. హర్ష్ మల్హోత్రా (కొత్త) (భాజపా) ☛ కార్పొరేట్‌ వ్యవహారాలు, రోడ్డు రవాణా - హైవేలు
68. నిముబెన్ జయంతిభాయ్ బాంభణియా (కొత్త) (భాజపా) ☛ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ☛ ప్రజా పంపిణీ
69. మురళీధర్ మొహోల్ (కొత్త) (భాజపా) ☛ సహకార, పౌర విమానయానం
70. జార్జ్ కురియన్ (కొత్త) (భాజపా) ☛ మైనారిటీ వ్యవహారాలు, మత్స్య - పశుసంవర్ధక - డెయిరీ
71. పబిత్ర మార్గరీటా (కొత్త) (భాజపా) ☛ విదేశీ వ్యవహారాలు, టెక్సటైల్స్‌

#Tags