భారతదేశ రక్షణ వ్యవస్థ
భారత రక్షణ దళాల అధిపతి రాష్ర్టపతి. భారత రక్షణ దళాలు కేంద్ర రక్షణ శాఖా మంత్రి అధీనంలో ఉంటాయి. ప్రస్తుత రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ. మనదేశ రక్షణ వ్యవస్థలో దాదాపు 47 లక్షల మంది పనిచేస్తున్నారు. డిసెంబర్ 7వ తేదీని రక్షణ దళాల ఫ్లాగ్‌డేగా నిర్వహిస్తారు. రక్షణ దళాల ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
త్రివిధ దళాల అధిపతులు
సైనిక దళాల అధిపతి - జనరల్ బిక్రమ్‌సింగ్
నౌకాదళ అధిపతి - అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషి
వాయుసేనాధిపతి - ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహ
స్వాతంత్య్రం తర్వాత భారతదేశం పాకిస్థాన్‌తో నాలుగు యుద్ధాలు చేసింది. అవి.. 1947, 1965, 1971, 1999. భారతదేశం 1971లో పాకిస్థాన్‌ను ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైంది. 1962లో చైనాతో యుద్ధం చేసింది.
భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర. దీని తర్వాత మహావీర చక్ర, వీరచక్ర వరుసగా అత్యున్నత సైనిక పురస్కారాలు. దేశ రక్షణ కోసం అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఈ శౌర్య పతకాలను బహూకరిస్తారు. యుద్ధంలేని సందర్భంలో అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి అశోక్ చక్ర, కీర్తిచక్ర, శౌర్యచక్రలను ఇస్తారు.
భారత క్షిపణి వ్యవస్థ:
భారత రక్షణ దళాలు ఉపయోగించుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేసే భూమికను డిఫెన్‌స రీసెర్‌చ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పోషిస్తుంది. దీన్ని 1958లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అవినాశ్ చందర్ ప్రస్తుత డీఆర్‌డీవో డెరైక్టర్ జనరల్. అంతేకాకుండా రక్షణ శాఖా మంత్రికి శాస్త్రీయ సలహాదారు. అవినాశ్‌కు 2013లో పద్మశ్రీ లభించింది.
ఈ సంస్థ మాజీ డెరైక్టర్ జనరల్ విజయ్‌కుమార్ సారస్వత్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత.
సాగరిక: దీన్నే కె-15 క్షిపణి అంటారు. దీన్ని జలాంతర్గామి నుంచి ప్రయోగిస్తారు. పరిధి 700 కి.మీ.
బ్రహ్మోస్: ఇది సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ధ్వనికంటే వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, భూమిపై కదిలే వాహనాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. దీన్ని భారత్, రష్యాలు సంయుక్తంగా నిర్మించాయి. భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మాస్కోవా నది పేర్ల మీద బ్రహ్మోస్ పేరును పెట్టారు. ఈ క్షిపణి పరిధి 290 కి.మీ. ఇది 2.5 నుంచి 2.8 మ్యాక్ వేగంతో ప్రయాణిస్తుంది.
నిర్భయ్: ఇది సబ్‌సోనిక్ క్షిపణి. ధ్వని వేగం (1 మ్యాక్) కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. పరిధి 1,000 కి.మీ. అమెరికాలో టోమహాక్, పాకిస్థాన్‌లో బాబర్ క్షిపణులు కూడా సబ్‌సోనిక్ క్షిపణులే.
మెయిన్ బ్యాటిల్ ట్యాంక్‌లు:
అర్జున్: ఇది మెయిన్ బ్యాటిల్ ట్యాంక్. దీన్ని డీఆర్‌డీవో తయారు చేసింది. దీన్ని కంచన్ అనే లోహ కవచంతో తయారు చేశారు.
టీ-90: రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. టీ-72 ట్యాంకును ఆధునీకరించి టీ-90ను తయారు చేశారు. వీటినే భీష్మ అంటారు.
టీ-72 అజేయ:
దీన్ని కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు.
డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన మల్టిపుల్ రాకెట్ లాంచర్ పేరు పినాకా. దీన్ని కార్గిల్ యుద్ధంలో విస్తృతంగా వాడారు.
నావికాదళం: భారత నావికాదళంలోని కమాండ్లు
పశ్చిమ కమాండ్ - ముంబై
తూర్పు కమాండ్- విశాఖపట్నం
దక్షిణ కమాండ్ - కొచ్చి
అణు జలాంతర్గాములు
1. ఐఎన్‌ఎస్ చక్ర
- దీన్ని రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు.
2. ఐఎన్‌ఎస్ అరిహంత్ - స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తొలి అణు జలాంతర్గామి.
వైమానిక దళం
తేజస్: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం పేరు తేజస్. ఇది ఎల్‌సీఎ (లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్)
లక్ష్య: పైలట్ రహిత టార్గెట్ ఎయిర్‌క్రాఫ్ట్. దీన్ని హెచ్‌ఏఎల్ తయారు చేసింది.
నిశాంత్: ఇది మానవరహిత విమానం అన్‌మ్యాన్‌డ ఏరియల్ వెహికిల్ (యూఏవీ).
ద్రువ్: హెచ్‌ఏఎల్ తయారుచేసిన హెలికాప్టర్.
రుద్ర: ధ్రువ్ హెలికాఫ్టర్‌ను ఆధునీకరించి రుద్ర అనే అటాక్ హెలికాప్టర్‌ను తయారు చేశారు.
ఇతర రక్షక దళాలు
అస్సాం రైఫిల్స్:1835లో ప్రారంభమైన అత్యంత ప్రాచీన పారామిలిటరీ దళం. ప్రధాన కార్యాలయం షిల్లాంగ్‌లో ఉంది.
స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్‌స (ఎస్‌ఎఫ్‌ఎఫ్):1962లో ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌లోని చక్రతాలో ప్రధాన కార్యాలయం ఉంది.
ఇండియన్ కోస్ట్‌గార్‌డ:1978లో ఏర్పాటైంది. రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పని చేస్తుంది. భారత తీరరేఖని సంరక్షిస్తుంది.
సెంట్రల్ రిజర్‌వ పోలీస్ ఫోర్‌స (సీఆర్‌పీఎఫ్):1939లో ఏర్పాటైంది. ప్రస్తుత డెరైక్టర్ జనరల్ దిలీప్ త్రివేది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్‌స (బీఎస్‌ఎఫ్):1965లో ఏర్పాటైంది.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ):1962లో ఏర్పాటు చేశారు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్‌స (సీఐఎస్‌ఎఫ్): 1969లో ఏర్పాటైంది.
రాష్ట్రీయ రైఫిల్స్: తీవ్రవాద నిరోధక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. 1990లో ఏర్పాటైంది.
నేషనల్ సెక్యూరిటీ గార్‌డ్స (ఎన్‌ఎస్‌జీ): 1984లో ఏర్పాటైంది.
ప్రధాన సైనిక శిక్షణా కేంద్రాలు
1. నేషనల్ డిఫెన్‌స అకాడమీ- ఖడక్ వాస్లా (పుణె)
2. ఇండియన్ మిలిటరీ అకాడమీ- డెహ్రాడూన్
3. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్- డెహ్రాడూన్
4. ఆర్మీవార్ కాలేజ్ (కాలేజ్ ఆఫ్ కంబాట్)- మౌ (మధ్యప్రదేశ్)
5. ఇన్‌ఫాంట్రీ స్కూల్- మౌ
6. ఆఫీసర్‌స ట్రైనింగ్ అకాడమీ- చెన్నై
7. హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్- గుల్‌మార్‌గ
8. ఆర్మర్‌డ కార్‌ప్స సెంటర్ అండ్ స్కూల్-అహ్మద్‌నగర్
9. స్కూల్ ఆఫ్ ఆర్టిల్లరీ- దేవ్‌లాలీ (మహారాష్ర్ట)
10. కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్- ఖడ్కీ (మహారాష్ర్ట)
11. మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - మౌ
12. కౌంటర్ ఇన్‌సర్జన్సీ అండ్ జంగిల్ వార్‌ఫేర్ స్కూల్ - వెరైంగ్టే (మిజోరాం)
13. ఆర్మీ మెడికల్ కార్‌ప్స సెంటర్ అండ్ స్కూల్-లక్నో
14. కాలేజ్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్‌మెంట్- జబల్‌పూర్
15. మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్- సికింద్రాబాద్
16. రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్‌ప్స సెంటర్ అండ్ స్కూల్- మీరట్
17. ఆర్మీ ఎడ్యుకేషన్ కార్‌ప్స ట్రైనింగ్ కాలేజ్ అండ్ సెంటర్- పచ్‌మడి (మధ్యప్రదేశ్)
18. కార్‌ప్స ఆఫ్ మిలిటరీ పోలీస్ సెంటర్ అండ్ స్కూల్- బెంగళూర్
19. ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్- పుణె
20. ఆర్మీ ఎయిర్‌బార్‌న ట్రైనింగ్ స్కూల్- ఆగ్రా
21. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్- పుణె
22. ఆర్మీ కేడెట్ కాలేజ్- డెహ్రాడూన్
23. ఆర్మీ క్లర్‌క్స ట్రైనింగ్ స్కూల్- ఔరంగాబాద్
24. ఆర్మీ స్కూల్ ఆఫ్ మెకానికల్ ట్రాన్‌సపోర్‌ట- బెంగళూర్
25. ఆర్మీ, ఎయిర్ ట్రాన్‌సపోర్‌ట స్కూల్- ఆగ్రా
26. మిలిటరీ ఇంటెలిజెన్‌స ట్రైనింగ్ స్కూల్ అండ్ డిపో - పుణె
27. ఆర్‌మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్- పుణె
వైమానిక దళ సంస్థలు
1. ఎయిర్‌ఫోర్‌స అకాడమీ- దుండిగల్ (హైదరాబాద్)
2. ఎయిర్‌ఫోర్‌స అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్- కోయంబత్తూర్
3. పైలట్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్- అలహాబాద్
4. స్కూల్ ఆఫ్ ఏవియేషన్ మెడిసిన్- బెంగళూర్
5. ఎయిర్‌ఫోర్‌స టెక్నికల్ ట్రైనింగ్ కాలేజ్- జలహళ్లి (బెంగళూరు)
6. పారాట్రూపర్‌స ట్రైనింగ్ స్కూల్- ఆగ్రా
7. ఇండియన్ ఎయిర్‌ఫోర్‌స టెస్ట్ పైలట్ స్కూల్- బెంగళూరు
ఇవే కాకుండా నేషనల్ డిఫెన్‌స కాలేజ్ న్యూఢిల్లీలో, కాలేజ్ ఆఫ్ డిఫెన్‌స మేనేజ్‌మెంట్ సికింద్రాబాద్‌లో, డిఫెన్‌స సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగటన్‌లో ఉన్నాయి.
నౌకాదళ సంస్థలు
1. ఇండియన్ నావల్ అకాడమీ- ఎజిమల (కేరళ)
2. ఐఎన్‌ఎస్ అగ్రాని- కోయంబత్తూర్
3. ఐఎన్‌ఎస్ చిల్కా- ఒడిశా
4. ఐఎన్‌ఎస్ ద్రోణాచార్య- కొచ్చి
5. ఐఎన్‌ఎస్ గరుడ- కొచ్చి
6. ఐఎన్‌ఎస్ హమ్లా- ముంబై
7. ఐఎన్‌ఎస్ కుంజలి- ముంబై
8. ఐఎన్‌ఎస్ మండోవీ- గోవా
9. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోగ్రఫీ- గోవా
10. ఐఎన్‌ఎస్ శివాజీ- లోనావాలా
11. షిప్‌రైట్ స్కూల్- విశాఖపట్నం
12. ఐఎన్‌ఎస్ వల్సురా- జాంనగర్
13. ఐఎన్‌ఎస్ వెందుర్తి- కొచ్చి
14. ఐఎన్‌ఎస్ శాతవాహన- విశాఖపట్నం
ఏపీపీఎస్సీ పరీక్షలలో అడిగిన కొన్ని ప్రశ్నలు
1. అగ్ని-5 లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ఒడిశాలోని ఏ ప్రదేశం నుంచి పరీక్షించారు?
2. 2012లో ఏప్రిల్ 23న పాకిస్థాన్ విజయవంతంగా ప్రయోగించిన క్షిపణి పేరు?
3. ఇండియా ఏ దేశంతో కలసి ‘ఇంద్ర’ నౌకా విన్యాసం నిర్వహించింది?
4. 2012లో మే 31న 25వ భారత సేనాధిపతిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు?
5. భారత నౌకా దళాధిపతి ఎవరు?
6. 2012 ఏప్రిల్‌లో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టిన, న్యూ క్లియర్ శక్తితో దాడిచేయగల జలాంతర్గామి పేరేమిటి?
7. అణుశక్తి సామర్థ్యం ఉన్న అగ్ని-5ని విజయవంతంగా ప్రయోగాత్మకంగా ప్రయోగించిన రోజు?
8. బ్రహ్మోస్ క్షిపణిని భారతదేశం ఏ దేశంతో కలసి తయారు చేసింది?
సమాధానాలు: 1) వీలర్ ద్వీపం; 2) షాహీన్-1; 3) రష్యా; 4) బిక్రమ్‌సింగ్; 5) డి.కె. జోషి; 6) ఐఎన్‌ఎస్ చక్ర; 7) ఏప్రిల్ 19, 2012; 8) రష్యా

క్షిపణి | ప్రయోగించే విధానం | పరిధి (కిలోమీటర్లు) |
పృథ్వీ-1 | ఉపరితలం నుంచి ఉపరితలానికి | 150 కి.మీ. |
పృథ్వీ-2 | ఉపరితలం నుంచి ఉపరితలానికి | 250-350 కి.మీ. |
పృథ్వీ-3 | ఉపరితలం నుంచి ఉపరితలానికి | 350-600 కి.మీ. |
ఆకాశ్ | ఉపరితలం నుంచి గగనతలం | 30 కి.మీ. |
త్రిశూల్ | ఉపరితలం నుంచి గగనతలం | 9 కి.మీ. |
నాగ్ | యాంటీ ట్యాంక్ క్షిపణి | 4-5 కి.మీ. |
ధనుష్ | ఉపరితలం నుంచి ఉపరితలానికి | 350 కి.మీ. |
అగ్ని-1 | ఉపరితలం నుంచి ఉపరితలానికి | 700 కి.మీ. |
అగ్ని-2 | ఉపరితలం నుంచి ఉపరితలానికి | 2,000-3,000 కి.మీ. |
అగ్ని-3 | ఉపరితలం నుంచి ఉపరితలానికి | 3500 కి.మీ. |
అగ్ని-4 | ఉపరితలం నుంచి ఉపరితలానికి | 4000 కి.మీ. |
అగ్ని-5 | ఉపరితలం నుంచి ఉపరితలానికి అగ్ని- 5 భారతదేశ తొలి ఖండాంతర క్షిపణి 2012లో ఏప్రిల్ 19న తొలిసారి ఒడిశాలోని వీలర్ ఐల్యాండ్ నుంచి ప్రయోగించారు. మరోసారి ఈ ఏడాది సెప్టెంబర్ 15న రెండోసారి ప్రయోగించారు | 5000-6000 కి.మీ. |
అస్త్ర | గగనతలం నుంచి గగనతలానికి | 80-110 కి.మీ. |
శౌర్య | ఉపరితలం నుంచి ఉపరితలానికి | 750-1900 కి.మీ. |
ప్రహార్ | ఉపరితలం నుంచి ఉపరితలానికి | 150 కి.మీ. |
#Tags