Earthquake in Japan జపాన్‌లో భారీ భూకంపం.. ఎనిమిది మంది మృతి..! ఇది అక్కడి పరిస్థితి

జపాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఇక్కడ ఎన్నో అగ్ని ప్రమాదాలు జరిగాయి. పలు చోట్లలో స్థలాలు కుప్పకూలిపోయాయి. ఈ విషయంపై జపాన్‌ ప్రధాని అయిన పుమియో కిషిడా సమీక్ష నిర్వహించి మాట్లాడాతూ అక్కడి పరిస్థితి గురించి వివరించారు..

► జపాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో సహాయ చర్యలపై ప్రధానమంత్రి పుమియో కిషిడా సమీక్ష నిర్వహించారు. ‘భూకంపంతో తీవ్రమైన నష్టం జరిగింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చోటు చేసుంది. పలు చోట్ల భవనాలు కూలిపోయాయి. కొన్ని చోట్లలో అగ్ని ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి.’ అని తెలిపారు. ఈ ప్రమాదంతో  ఇబ్బందులు ఎదురుకున్న వారికి  సహయక చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. పలు చోట్లలో కూలీపోయిన భవనాల శిథిలాల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకురావడానకి రెస్య్కూ టీం సాయం అందిస్తోందని పేర్కొన్నారు.

India Students In Canada: కెనడా వెళ్లే విద్యార్థులకు షాక్‌.. కారణం అదేనా..?

► జపాన్‌ భారీ భూకంపంతో సోమవారం నుంచి 155 సార్లు  భూమి కంపించింది. భారీ భూకంపంతో పలు భవనాలు కూలిపోయాయి. రోడ్లపై పగుళ్లు వచ్చాయి. భూకంప తీవ్రతకు తెలిపే CCTV ఫుటేజీ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో రోడ్ల పగుళ్లు, రైల్వే స్టేషన్‌లో బోర్డులు ఊగిపోవటం కనిపిస్తున్నాయి.

Egg Prices In Pakistan: ఆర్థిక సంక్షోభం అంచున పాకిస్థాన్‌..!

 ► భారీ భూకంపం జపాన్‌ను కుదిపేసింది. సోమవారం రిక్కార్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు జపాన్‌ వాతారణ  సంస్థ పేర్కొంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. మరికొన్ని ఇళ్లకు పగుళ్లు కనిపించాయి. ఈ కారణంగా ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 

Ukraine War: ఉక్రెయిన్‌కు 250 మిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయం

అదేవిధంగా జపాన్‌లో చోటుచేసుకున్న భూకంపం కారణంగా ఇషికావా నగరంలో భారీగా మంటలు చెలరేగాయి. పలు భవనాలు మంటల్లో కాలిపోయాయి కూడా. 30,000 కంటే ఎక్కువ గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని సమాచారం.

Japan Earthquake: జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు జారీ!

ఇషిగావా రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో వరుసగా భూప్రకంపనలు సంభవించాయి. ఇషిగావాలోని నోటో ప్రాంతం నుంచి 300 కిలోమీటర్ల మేర సునామీ అలలు విస్తరించే అవకాశం ఉందని స్థానిక వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. భూకంపం వల్ల ఇళ్లు కంపిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. భూప్రకంపనలతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు కుర్చీలు, టేబుళ్ల కింద దాక్కున్నారు.

#Tags