ప్రపంచ అటవీ దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?

ఐక్యరాజ్యసమితి మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 2012 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు ముఖ్య‌ ఉద్దేశ్యం అడవుల ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన‌ పెంచడం. అడవి వెలుపల చెట్ల ప్రాముఖ్యతపై కూడా ఈ రోజు దృష్టి సారించింది.

2021 సంవత్సరానికి థీమ్: అటవీ పునరుద్ధరణ: పునరుద్ధరణ, శ్రేయస్సుకు మార్గం. అంతర్జాతీయ వ్యవసాయ దినోత్సవ ఆలోచనను యూరోపియన్ అగ్రికల్చరల్ ఫెడరేషన్ 23వ కాంగ్రెస్‌లో ఆమోదానికి ఉంచారు. ప్రతి సంవత్సరం 13 మిలియన్ హెక్టార్లకు పైగా అడవులు నాశ‌నం అవుతున్నాయి. పెద్ద ఎత్తున అటవీ నిర్మూలన ప్రపంచ కార్బన్ ఉద్గారాలలో 12% నుంచి 18% వరకు పెరిగేందుకు కారణమైంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యుఎన్‌జీఏ)లో మార్చి 21ను ప్రపంచ అటవీ దినోత్సవంగా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి ఫోరమ్ ఆన్ ఫారెస్ట్స్ మరియు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అటవీ దినోత్సవానికి నిర్వ‌హిస్తుంది.

#Tags