జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

స‌ర్ సీవీ రామ‌న్ "రామన్ ఎఫెక్ట్‌" కనుగొన్న జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని (ఎన్‌ఎస్‌డీ) నిర్వహిస్తారు.

మొద‌టిసారి ఎన్ఎస్‌డీని ఫిబ్రవరి 28, 1987న జరుపుకుంది. రామ‌న్ ఎఫెక్ట్ క‌నుగొనందున స‌ర్ సీవీ రామ‌న్ నోబెల్ బ‌హుమ‌తి గెలుచుకున్నాడు.

ఈ ఎన్ఎస్‌డీకి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన‌ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్ఛేంజ్ కమిటీ (ఎన్‌సీఎస్‌టీసీ) మ‌ద్ధ‌తు ఇస్తుంది. విద్య, నైపుణ్యాలు, ప‌నిపై ప్రభావాల గురించి ఇది వివ‌రిస్తుంది. రామన్ ఎఫెక్ట్ అనేది ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకట రామన్ కనుగొన్న స్పెక్ట్రల్ ఫినోమేన‌న్. దీన్ని 1928లో క‌నుగొన‌గ 1930లో ఆయ‌న‌కు నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌దానం చేశారు. ఇది సైన్స్ రంగంలో భారతదేశపు మొట్టమొదటి నోబెల్ బహుమతి.

కాంతి పుంజం అణువుల ద్వారా విక్షేపం అయినప్పుడు సంభవించే కాంతి తరంగదైర్ఘ్యంలో మార్పును రామన్ ఎఫెక్ట్ అంటారు. పుంజం దుమ్ము లేని, పారదర్శక సమ్మేళనం నమూనా గుండా వెళుతున్నప్పుడు, పుంజంతో చాలా త‌క్కువ భాగం ఇన్‌కమింగ్ పుంజానికి వ్య‌తిరేక దిశ‌లో ప‌య‌నిస్తుంద‌ని ఆయ‌న క‌నుగొన్నారు.

#Tags