Doomsday Glacier: డూమ్స్‌డే గ్లేసియర్‌.. ఒక భయంకరమైన ముప్పు

అంటార్కిటికా ఖండం పశ్చిమ భాగంలో ఉన్న డూమ్స్‌డే గ్లేసియర్‌ (థ్వాయిట్స్‌ గ్లేసియర్‌) మనుగడ ముప్పును ఎదుర్కొంటోంది.

గత 80 ఏళ్లలో, ఈ గ్లేసియర్‌ ఏకంగా 50 బిలియన్‌ టన్నుల మంచును కోల్పోయింది. ప్రస్తుతం 130 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గ్లేసియర్‌ క్రమంగా కరిగిపోతోంది. కొత్తగా ఏర్పడే మంచు కంటే కరిగిపోయే మంచు ఎక్కువగా ఉండడంతో, మరికొన్నేళ్లలో ఈ గ్లేసియర్‌ పూర్తిగా అంతమైపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

డూమ్స్‌డే గ్లేసియర్‌ ఎందుకు కరుగుతోంది?
 ➤ ఎల్‌–నినో ప్రభావం కారణంగా భూమి వేడెక్కుతుండడం.
 ➤ అంటార్కిటికా ఖండంలో ఉష్ణోగ్రతలు పెరగడం.

డూమ్స్‌డే గ్లేసియర్‌ కరిగిపోతే ఏం జరుగుతుంది?
 ➤ పశ్చిమ అంటార్కిటికా నుంచి సముద్రంలోకి మరింత నీరు చేరుతుంది.
 ➤ సముద్ర మట్టం 65 సెంటీమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉంది.
 ➤ లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి.
 ➤ భారీ జలవిధ్వంసం జరుగుతుంది.

India Environment Report: హిమగిరులకు పెనుముప్పు.. 2100 నాటికి హిమాలయాల్లో 75 శాతం మంచు మాయం!

డూమ్స్‌డే గ్లేసియర్‌ను కాపాడటానికి ఏం చేయవచ్చు?
 ➤ గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి.
 ➤ పారిశ్రామిక ఉద్గారాలను తగ్గించాలి.
➤ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.
➤ డూమ్స్‌డే గ్లేసియర్‌ కరిగిపోవడం ఒక భయంకరమైన ముప్పు. ఈ ముప్పును  అధిగమించడానికి మనం అందరం కలిసి పనిచేయాలి.

#Tags