Paytm Employees Layoffs: పేటీఎం ఉద్యోగుల తొలగింపు.. ప్రకటించిన నివేదిక వివరాలు..

వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం.. కాస్ట్‌ కటింగ్‌లో భాగంగా దేశంలో పలు ప్రాంతాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల్లో పలువురిని పేటీఎం తొలగించినట్లు సమాచారం. పూ‍ర్తి వివరాలను తెలుసుకుందాం..

ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. సుమారు వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు ప్రకటించింది.

Winter Parliament Session 2023: సీఈసీ, ఈసీల నియామకాల బిల్లుకు ప్రధానమంత్రి ప్యానెల్‌.. ఈ బిల్లులో ఏముందంటే..?

వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం.. కాస్ట్‌ కటింగ్‌లో భాగంగా దేశంలో పలు ప్రాంతాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల్లో పలువురిని పేటీఎం తొలగించినట్లు సమాచారం. ఈ మొత్తం సంఖ్య 10 శాతం కంటే ఎక్కువగా ఉంది.

Covid-19: మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. దేశంలో ఎంత మంది మరణించారంటే..!

అయితే గత రెండు మూడేళ్ల క్రితం పేటీఎం ఉద్యోగుల్ని భారీ ఎత్తున నియమించుకుంది. ఇప్పుడు ఉద్వాసన పలికిన ఉద్యోగుల్లో వీళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఈ తరుణంలో ఉద్యోగుల తొలగింపుపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. ఖర్చుల్ని తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా సిబ్బందిని తొలగించినట్లు తెలిపారు. ఉద్యోగుల తొలగింపుతో ఖాళీ అయిన విభాగాల్లో ఆర్టిఫిష్యల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో భర్తీ చేసినట్లు వెల్లడించారు.  

Bill Acceptance: మూడు కీలక బిల్లులకు లోక్‌సభ ఆమోదం.. అవి ఇవే..

ఇక వచ్చే ఏడాది పేటీఎం మరో 15వేల మంది ఉద్యోగుల్ని నియమించుకోనుంది. పేటీఎం తన పని విధానంలో ఏఐ ఆధారిత ఆటోమేషన్‌తో మారుస్తోందని, సంస్థ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఖర్చులు పెరిగేందుకు దోహదం చేసేందుకు  వీలుండే ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు జారీ చేసినట్లు పేటీఎం ప్రతినిధి వెల్లడించారు. 

#Tags