GATE 2025 Hall Ticket Download : గేట్ 2025 హాల్‌టికెట్ విడుదల.. ఆ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి..
సాక్షి ఎడ్యుకేషన్: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కించుకున్న విద్యాసంస్థలు ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్, ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ప్రవేశాలు పొందాలంటే గేట్ పరీక్ష (GATE 2025)లో ఉత్తీర్ణత సాధించాలి. దీని కోసం ఇప్పటికే అనేక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం, దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులను అధికారులు నేడు విడుదల చేశారు.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2025 ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఐఐటీ రూర్కీ అభ్యర్ధుల కోసం అడ్మిట్ కార్డులను జనవరి 2నే విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాలు వల్ల వాయిదా పడింది. అవి నేడు అంటే, జనవరి 7వ తేదీన గేట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా విడుదల చేశారు అధికారులు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ gate2025.iitr.ac.in లోంచి తమ హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇవి చెక్ చేసుకోండి..
గేట్ పరీక్ష రాసే విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత, అందులో అభ్యర్ధుల పేరు, రిజిస్టర్ ఐడీ, పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ, సమయం, పేపర్ కోడ్, వర్గం వంటి వివరాలను పరిశీలించుకోవాలి. ఇందులో ఏదైనా తేడా ఉంటే వెంటనే అభ్యర్ధులు గేట్ నిర్వహణ అధికారుల్ని సంప్రదించి పరీక్షకు ముందే వాటిని సరి చేయించుకోవాలి. పరీక్షకు అభ్యర్ధులు తమ హాల్‌టికెట్లను, ఐడీ ప్రూఫ్‌ను తమ వెంట తీసుకెళ్లాలి.
డౌన్‌లోడ్ విధానం..
గేట్ అధికారిక వెబ్‌సైట్ gate2025.iitr.ac.in. లోకి వెళ్లి.. గేట్ 2025 అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేసి, మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ చేయాలి. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటౌట్ తీసుకోవాలి.
గేట్ 2025 పరీక్షలు ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్నారు. గేట్ 2025 కంప్యూటర్ ఆధారిత పరీక్ష. పరీక్షకు వెళ్లే సమయంలో మీ హాల్‌టికెట్‌ను వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)