Teaching Posts : ఏఈఈఎస్‌లో టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

ముంబైలోని అటామిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీ (ఏఈఈఎస్‌).. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అటామిక్‌ ఎనర్జీ కేంద్రీయ విద్యాలయాలు/జూనియర్‌ కాలేజీల్లో ఉన్న టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 09.
»    పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్‌–06, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌–03.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఈడీ, డిప్లొమా, పీజీ, సర్టిఫికేట్‌ కోర్సు, సీటెట్‌ స్కోరు, ఇంగ్లిష్‌ మీడియంలో టీచింగ్‌ అనుభవం ఉండాలి.
»    వయసు: ప్రిన్సిపల్‌ పోస్టుకు 35 నుంచి 50 ఏళ్లు, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టుకు 18 నుంచి 35 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: గూగుల్‌ ఫాం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 12.07.2024.
»    వెబ్‌సైట్‌: https://www.aees.gov.in

PMBI Contract Jobs : న్యూఢిల్లీలోని పీఎంబీఐలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తులు ఇలా..

#Tags