Faculty Posts : ఎస్‌పీఏలో రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న ఫ్యాక‌ల్టీ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు.. పోస్టుల వివ‌రాలు ఇలా..

ఢిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (స్పా).. ఫుల్‌టైమ్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 39.
»    పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–09, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–09, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–21.
»    విభాగాలు: ఆర్కిటెక్చర్, బిల్డింగ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ల్యాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్చర్, హౌసింగ్‌/ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్, రీజనల్‌ ప్లానింగ్, అర్బన్‌ ప్లానింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌ తదితరాలు.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ(ఆర్కిటెక్చర్‌/ప్లానింగ్‌/టెక్నాలజీ/ఇంజనీరింగ్‌), పీజీ (ఎకనామిక్స్‌ /సోషియాలజీ/జాగ్రఫీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధానానుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తులకు చివరితేది: నోటిఫికేషన్‌ వెలువడిన తేదీ 29.08.2024 నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
»    వెబ్‌సైట్‌: http://www.spa.ac.in

Paris Olympics: 24 ఏళ్ల తర్వాత.. ఇథోయోపియా అథ్లెట్‌కు పసడి పతకం

#Tags