Asst Professor Posts : సీఐపీఈటీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు.. అర్హులు వీరే!

న్యూఢిల్లీలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సీపెట్‌) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 12
»    పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–08, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–02, లైబ్రేరియన్‌–01, అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌–01.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 65 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.35,000 నుంచి రూ.40,000, అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌ పోస్టుకు రూ.35,000, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.46,400, లైబ్రేరియన్‌కు రూ.30,000.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    దరఖాస్తును ది డైరెక్టర్‌ అండ్‌ హెడ్, సీఐపీఈటీ: సీఎస్‌టీఎస్‌–హజీపూర్, ఇండస్ట్రియల్‌ ఏరియా, హజిపూర్, వైశాలి, బీహార్‌–844102 చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 09.09.2024.
»    వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in

Jobs at IISC : ఐఐఎస్‌సీలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న పోస్టులు.. ఈ విభాగాల్లోనే..

#Tags